For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగా ఫ్యాన్ వర్సెస్ మెగా హీరో: 2017 ఫైనల్ క్లాష్‌ ఇదే.. ఎవరిది పైచేయి?

  |
  మెగా హీరో Vs మెగా ఫ్యాన్.. 2017 ఫైనల్ క్లాష్‌ ఇదే..!

  ఇద్దరు పేరున్న హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే.. కచ్చితంగా రెండింటిలో దేనిది పైచేయి అన్న చర్చ కామన్. అఫ్‌కోర్స్.. ఇప్పుడు చెప్పుకోబోయే ఇద్దరు.. హీరోగా పేరు తెచ్చుకోవడానికి ఇంకా కష్టపడుతున్నవారే. అందులోనూ ఒకరు మెగా కాంపౌండ్ హీరో అయితే.. మరొకరు మెగా ఫ్యాన్ కావడం విశేషం. 2017 ఫైనల్ క్లాష్ ఇప్పుడు వీరిద్దరి మధ్యే కావడం మరో విశేషం..

   మెగా హీరో.. ఒక్క క్షణం:

  మెగా హీరో.. ఒక్క క్షణం:

  డిసెంబర్ 28న అల్లు శిరీష్ ఒక్క క్షణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రమోషన్, బజ్ రీత్యా ఈ సినిమాపై బాగానే ఎటెన్షన్ క్రియేట్ అయింది. హీరోగా నిలదొక్కుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్న అల్లు శిరీష్.. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలనుకుంటున్నాడు. 2017కి విజయంతో ఎండ్ కార్డ్ వేయాలని భావిస్తున్నాడు.

  మెగా ఫ్యాన్.. 2 కంట్రీస్:

  మెగా ఫ్యాన్.. 2 కంట్రీస్:

  మెగాస్టార్ చిరంజీవి అంటే సునీల్‌కు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మెగా కాంపౌండ్ హీరోతోనే సునీల్ పోటీ పడాల్సి రావడం అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

  ఇక సినిమాల పరంగా చాలాకాలంగా హిట్ లేక సతమవుతున్నాడు సునీల్. ఈసారి శంకర్ దర్శకత్వంలో డిసెంబర్ 29న '2కంట్రీస్'తో రాబోతున్నాడు. మలయాళంలో దిలీప్ నటించిన సినిమాకు ఇది రీమేక్.
  కథలో కామెడీ ప్రధానంగా ఉండటం.. గతంలో కామెడీ ఇరగదీసిన నేపథ్యం సునీల్ కు ఉండటంతో.. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

  ఒక్క క్షణంపై పాజిటివ్ బజ్..:

  ఒక్క క్షణంపై పాజిటివ్ బజ్..:

  అల్లు శిరీష్ కు ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఆయన సినిమాలకు బాగా హెల్ప్ అవుతుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రీ-రిలీజ్ వేడుకకు బన్నీ హాజరై తమ్ముడి సినిమాపై మరింత ఎటెన్షన్ క్రియేట్ చేశాడు. ఇకపోతే.. ఈసారి అల్లు శిరీష్ కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కథ విషయంలో. బన్నీ కూడా ఇదో అర్థవంతమైన సినిమా అని పరోక్షంగా చెప్పుకొచ్చాడు.

  2కంట్రీస్ వీక్ ప్రమోషన్..:

  2కంట్రీస్ వీక్ ప్రమోషన్..:

  ఒక్క క్షణంతో పోల్చితే.. 2కంట్రీస్ సినిమా ప్రమోషన్ కాస్త వీక్ గానే సాగిందని చెప్పాలి. ఆడియో లాంచ్ కార్యక్రమం అంతగా ఆకట్టుకోలేదు. ఇక ట్రైలర్ విషయంలో మాత్రం కామెడీ పరంగా మంచి మార్కులే పడ్డాయి. చాన్నాళ్లకు మళ్లీ సునీల్ కామెడీని ఆస్వాదించే అవకాశం ఉండటం ఈ సినిమాకు మేజర్ హైలైట్ అవుతుందంటున్నారు.

  'ఒక్క క్షణం' కథ:

  'ఒక్క క్షణం' కథ:

  హాలీవుడ్ సినిమా 'ప్యారలల్ లైఫ్'కి ఇది కాపీ అన్న ప్రచారం జరుగుతుండటంతో.. దర్శకుడు విఐ ఆనంద్ దీనిపై వివరణ ఇచ్చుకున్నారు. కొన్ని యథార్థ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను తెరకెక్కించినట్లు ఆయన చెప్పారు.

  కోట్లాది జనాభాలో ఒకేరకంగా ఆలోచించేవాళ్లు, ఒకేలా జీవితాన్ని గడిపేవాళ్లు తప్పకుండా ఉంటారని, మా చుట్టాలమ్మాయి జీవితంలోనూ ఇలాంటి సంఘటనలే జరిగాయని, వాటి ఆధారంగా రాసుకున్న కథ ఇది అని వివరణ ఇచ్చారు.

  '2 కంట్రీస్' కథ:

  '2 కంట్రీస్' కథ:

  ఇప్పటిదాకా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేశాను కాబట్టి.. తన గత సినిమాలకు, ఈ సినిమాకు మార్పు ఉండేలా జాగ్రత్తపడ్డట్లు దర్శకుడు శంకర్ తెలిపారు.కథ ప్రకారం సినిమా 50 శాతం న్యూయార్క్ నేపథ్యంలో సాగనుంది. మిగతా సగం ఇండియాలో సాగనుంది. సందేశం, ప్రేమ కలగలిపి వినోదాత్మకంగా రూపొందించిన చిత్రం ఇది.

   ఎవరిది పైచేయి?:

  ఎవరిది పైచేయి?:

  అల్లు శిరీష్ కన్నా మాస్‌లో సునీల్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. ఆవిధంగా బీ, సీ సెంటర్లలో సునీల్ సినిమాకు మంచి ఓపెనింగ్సే ఉండవచ్చన్న టాక్ ఉంది.

  అదే సమయంలో ఒక్క క్షణం దర్శకుడు విఐ ఆనంద్.. గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా! లాంటి వైవిధ్య భరితమైన కథతో హిట్ కొట్టడంతో.. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఒక్క రోజు తేడాతో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరో రెండు రోజులు ఆగితే కానీ దేని సత్తా ఎంత అనేది చెప్పలేం.

  English summary
  Two movies, one from mega hero and another from hard core mega fan coming on 28th and 29th December will call it a wrap for the old year.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X