ఈ రెండు రోజులు 'మెగా' కుటుంబ హంగామా
హైదరాబాద్ : ఈ రెండు రోజులు(మే 30,మే 31) మెగా హంగామా జరగనుంది. మే 30 న అల్లు శిరీష్ రెండవ చిత్రం కొత్త జంట ప్రారంభం కాబోతోంది. మారుతి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్ గా చేస్తోంది.
ఇక మే 31 న కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే రామ్ చరణ్ కొత్త చిత్రం ప్రారంభం కానుంది. బండ్ల గణేష్ శుక్రవారం తన ఆఫీసులో పూజ కార్యక్రమాలతో ఫార్మల్ గా లాంచ్ చేస్తారు.
ఇక అదే రోజు అంటే మే 31 న అల్లు అర్జున్ హీరోగా రూపొందే ఇద్దరమ్మాయిలతో చిత్రం విడుదలకానుంది. అల్లు అర్జున్ కెరీర్ లో ఎక్కువ థియోటర్స్ తో ఈ చిత్రం విడుదల అవుతోంది. దాంతో మెగా కుటుంబం అంతా ఈ రెండు రోజులూ హడావిడిగా ఉండనుంది.
ఈ రోజు గీతా అర్ట్స్ పతాకంపై బన్నీవాసు 'కొత్త జంట' చిత్రం ప్రారంభం కావటంతో మెగా ఫ్యామిలీ ఈ పంక్షన్ హాజరుకానుంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ అందరి ప్రశంసలు పొందుతోంది.
విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా త్వరలోనే సెట్స్‌పైకి రానున్నదని సమాచారం. ఈ చిత్రానికి గ్రేట్ పీపుల్ ఆర్ సెల్ఫిష్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. దర్శకుడు మాట్లాడుతూ ''శిరీష్ హావభావాలకు తగిన కథ ఇది. ప్రతి సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. కొత్తజంటగా శిరీష్, రెజీనా ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తారు. నా మూడో చిత్రమే గీతా ఆర్ట్స్ సంస్థలో చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది''అన్నారు.


Click it and Unblock the Notifications











