»   » కొణిదెల నిహారిక లాంచింగ్ కోసం మెగా ఈవెంట్

కొణిదెల నిహారిక లాంచింగ్ కోసం మెగా ఈవెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి సినిమా రంగంలోకి వస్తున్న తొలి హీరోయిన్ నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురైన ఈ ముద్దుగుమ్మ త్వరలో ‘ఒక మనసు' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో.

ఇప్పటి వరకు స్టార్ హీరోల వారసులు హీరోగా పరిచయం అవుతున్నారంటే... వారిని పరిచయం చేయడానికి భారీ ఈవెంట్స్ నిర్వహించడం ఆనవాయితీ. మెగా ఫ్యామిలీ హీరోల లాంచింగ్ సమయంలో కూడా ఇలాంటి ఈవెంట్స్ జరిగాయి. తాజాగా నిహారిక ను అందరికీ పరిచయం చేయడానికి మెగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవితో పాటు ఇతర స్టార్స్ అంతా హాజరవుతారని సమాచారం.

నిహారిక తొలి సినిమాకు.....మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి నిహారిక రూ. 40 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. సాధారణంగా కొత్త హీరోయిన్లకు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు మించి ఇవ్వరు. కానీ నిహారిక తొలి సినిమాకే రూ. 40 లక్షలు తీసుకుంటుండటం గమనార్హం.

Mega plans for Niharika’s launch

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న అమ్మాయి కావడం సినిమాకు ఓపెనింగ్స్ బావుంటాయి. అందు వల్లనే ఆమెకు ఇంత ఎక్కువ మొత్తం రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. మెగా స్టార్ వారసత్వంతో మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు దాదాపు అరడజను మంది హీరోలు పరిచయం అయ్యారు. అయితే ఆ ఫ్యామిలీ నుండి హీరోయిన్ మాత్రం ఇప్పటి వరకు సినిమా రంగంలోకి రాలేదు. నాగబాబు కూతురు నిహారిక మెగా ఫ్యామిలీలో కొత్త శకానికి నాంది పలికింది.

ఈ సినిమా ఇంకా ప్రారంభం కాక ముందే ఆమెకు హీరోయిన్ గా మరో ఆఫర్ కూడా వచ్చినట్లు సమాచారం. అవార్డు సినిమా దర్శకుడు అయోధ్య కుమార్ దర్శకత్వంలో ఆమె సినిమా అంగీకరించినట్లు సమాచారం.అయోధ్య కుమార్ మిణుగురులు చిత్రంతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. మంచి కాన్సెప్టుతో కూడిన కథ చెప్పడంతో నాగబాబు ఓకే చేసినట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే....ఈ చిత్రం తెలుగు-తమిళంలో తెరకెక్కబోతోందట.

English summary
Niharika Konidela will be making her silver screen debut with Naga Shaurya’s upcoming film. Film Nagar source reveals that the makers are planning a huge event for the launch. Interesting update is that the entire mega clan including all the star heroes will be present for the event.
Please Wait while comments are loading...