»   » భారీ సెలెబ్రేషన్స్ కు ప్లాన్ చేస్తున్న రాంచరణ్.. రంగస్థలంలో సంబరాలు!

భారీ సెలెబ్రేషన్స్ కు ప్లాన్ చేస్తున్న రాంచరణ్.. రంగస్థలంలో సంబరాలు!

Subscribe to Filmibeat Telugu

రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం బాహుబలి తరువాత టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రాంచరణ్ నటన, సుకుమార్ దర్శకత్వంతో రంగస్థలం చిత్రం క్రేజీ మూవీ గా మారిపోయింది. రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లతూ ఇప్పటికీ బలంగా దూసుకుపోతోంది. దీనితో చిత్ర యూనిట్ మొత్తం సంతోషంలో ఉంది. 1980 కాలం నాటి విలేజ్ పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ కు కనెక్ట్ అయిపోయింది.

రాంచరణ్, ఆదిపినిశెట్టి మధ్య ఎమోషనల్ సన్నివేశాలు, సమంతతో ఫన్నీగా సాగె రొమాంటిక్ సీన్స్, క్రూరమైన విలన్ పాత్రలో జగపతి బాబు పెర్ఫామెన్స్ సినిమా విజయం కీలక పాత్ర పోషించిన అంశాలు. సుకుమార్ కథ స్క్రీన్ ప్లే ఆడియన్స్ ని 2 గంటల 50 నిముషాల పాటు కట్టిపడేసేలా చేసాయి. ఇదిలా ఉండగా రాంచరణ్ రంగస్థలం చిత్ర విజయంతో భారీ సెలెబ్రేషన్స్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Mega power star Ram Charan planning for big success event of Rangasthalam

ఏప్రిల్ 13 లేదా 14 తేదీల్లో అభిమానులు, డిస్ట్రిబ్యూటర్ల సమక్షంలో రంగస్థలం చిత్ర సక్సెస్ సెలెబ్రేషన్స్ జరగనున్నట్లు వార్తలు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రాంచరణ్ తెలియజేసినట్లు టాక్. రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది.

English summary
Mega power star Ram Charan planning for big success event of Rangasthalam. This event may happens next week
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X