»   » మెగా పంచ్.....ఇష్టం లేకున్నా ప్రత్యే క హోదా ఇచ్చేస్తావా?

మెగా పంచ్.....ఇష్టం లేకున్నా ప్రత్యే క హోదా ఇచ్చేస్తావా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ట్రెండింగ్ టాపిక్స్, పాపులర్ ఇష్యూలను గుర్తు చేస్తూ ఈ మధ్య సినిమాల్లో పంచ్ డైలాగులు పెట్టడం సర్వసాధారణం అయింది. అలాంటి డైలాగులు కొన్ని ఇపుడు మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ తాజా సినిమా 'విన్నర్' లో వినిపిస్తున్నాయి.

ప్రత్యేక హోదా విషయంలో కొంతకాలంగా ఏపీలో హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఇపుడు దాన్ని గుర్తు చేస్తూ తాజాగా విడుదలైన 'విన్నర్' థియేట్రికల్ ట్రైలర్లో ఓ డైలాగ్ పెట్టారు. అంతే కాదు నేను గడ్డి పోచను గడ్డ పారను అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి మరి...



సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గ్రాండ్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం విన్న‌ర్‌. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఈ సినిమా రూపొందుతోంది. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల కానుంది. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.


Mega Punch dialogue about in Winner Theatrical Trailer

సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ - సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. హార్స్ రేసుల కాన్సెప్ట్ మూవీ. ఈ సినిమా షూటింగ్ టైంలో గోపీచంద్‌, ఛోటాగారు తీసుకున్న కేరింగ్ మ‌ర‌చిపోలేను. ఈ సినిమాకు ప‌నిచేయ‌డం బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. జ‌గ‌ప‌తిబాబుగారితో నేను చేస్తున్న సెకండ్ మూవీ. ర‌కుల్ కంటే ఈసినిమాలో జెబిగారితో మంచి అనుబంధం ఏర్ప‌డింది. థ‌మ‌న్ బ్యూటీఫుల్ ఆల్బ‌మ్ ఇచ్చాడు. అన్నీ పాట‌లు మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. గోపీచంద్‌గారు నాలోని స్పీడ్‌ను కంట్రోల్ చేసి నాలోని బెస్ట్ అవుట్‌పుట్‌ను రాబ‌ట్టుకున్నారు. ఛోటాగారితో నేను చేసిన ఐదో సినిమా విన్న‌ర్‌. బుజ్జిగారు, మ‌ధుగారు ఖ‌ర్చుకు వెనుకాడ‌లేదు. ఎందుకంటే క‌థ బ్యాక్‌డ్రాప్ అలాంటిది. కానీ వారు ఏం మాత్రం వెనుకాడ‌లేదు. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చే చిత్ర‌మ‌వుతుంది అన్నారు.


English summary
Check out Mega Punch dialogue about in Winner Theatrical Trailer. Winner Telugu Movie Theatrical Trailer. #Winner Telugu Movie ft. Sai Dharam Tej, Rakul Preet and Jagapathi Babu. Winner movie is directed by Gopichand Malineni and Music composed by SS Thaman. Produced by Nallamalupu Bujji and Tagore Madhu under Lakshmi Narashima Productions banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu