»   » శిఖరం అంచున సెల్ఫీ : ట్విటర్ లో పంచుకున్న ఉపాసన

శిఖరం అంచున సెల్ఫీ : ట్విటర్ లో పంచుకున్న ఉపాసన

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల 'ధృవ'తో కథానాయకుడిగా, 'ఖైదీ నెంబర్‌ 150'తో నిర్మాతగా ఘనవిజయాల్ని అందుకున్న రామ్ చరణ్. ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తాను హీరోగా సినిమా చేస్తుయునే ఇంకో పక్క సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 151వ సినిమా ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి నిర్మాణ పనులనూ చూసుకుంటున్నాడు.

మొన్నటి వరకూ సుకుమార్‌ సినిమా కోసం మండుటెండల్లో గోదావరి జిల్లాలో షూటింగ్‌లో పాల్గొన్నారు చెర్రీ. ఇప్పుడు కాస్త బ్రేక్‌ దొరికింది. దీంతో భార్య ఉపాసనతో కలిసి లండన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడట. తాజాగా యూరప్‌లోని ఓ మంచుకొండపై భార్యతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. దాదాపు ఏడుగంటలపాటు కష్టపడి ట్రెక్కింగ్‌ చేసి పర్వతశిఖరానికి చేరుకున్నారట.

ఈ ట్రెక్కింగ్‌ ద్వారా ఎన్నో కేలరీలను కరిగించేశామని ఉపాసన ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. ''బోల్డన్ని క్యాలరీస్ ని కరిగించేసాము. గ్రేట్ వర్కవుట్.. స్టే హెల్తీ అని'' ఉపాసన తన సోషల్ మీడియాలో పైనున్న సెల్పీని షేర్ చేసింది.ఆ మధ్య తూర్పు గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేసినప్పుడు కూడా చరణ్ వెంటే ఉన్న ఉపాసన అక్కడ ఇద్దరు కలిసి చూడదగ్గ ప్లేసెస్ అన్ని రౌండ్ కొట్టి వచ్చారు.

ఇప్పుడు మళ్ళి ట్రెక్కింగ్ లో జంటగా వెళ్లి మెగా ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చే ఫోటో ఒకటి వదిలారు. సో... షూటింగ్ కి బ్రేక్ తీసుకున్న రాంచరణ్ ఎంచక్కా ఉపానసతో కలిసి ట్రెకింగ్, సైట్ సీయింగ్ లు అంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. వచ్చే నెల నుంచి సుకుమార్ దర్శకత్వంలో తను చేస్తున్న చిత్రం షూటింగ్ తో బిజీ అయిపోతాడు రామ్ చరణ్.

English summary
"Long trek -7 hrs. Loads of calories burnt great workout #Wellbeing #forever" Tweeted Upasana Kamineni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu