»   »  సైమా లో చిరుతో 'మెగా' సెల్ఫీ, సుహాసిని పాట, అలీ కామెడీ...(ఫొటోలు,వీడియోలు)

సైమా లో చిరుతో 'మెగా' సెల్ఫీ, సుహాసిని పాట, అలీ కామెడీ...(ఫొటోలు,వీడియోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సింగపూర్ లో సైమా ఉత్సవం చాలా గ్రాండ్ గా మొదలైంది. మెగా స్టార్ చిరంజీవి అక్కడ స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. ఆయన్ను ప్రత్యేకంగా ఫెలిసిటేట్ చేసింది సైమా. ఆయన స్టేజిపై కు వెళ్లగానే...ఒక్కసారిగా తెలుగు సినిమాకు సంబంధించి హీరో,హీరోయిన్స్ అంతా అక్కడకు చేరుకున్నారు.
ఈ మెగా మూవ్ మెంట్ ని మిస్ చేసుకోకూడదని భళ్లారి దేవ దగ్గుపాటి రానా ... వెంటనే స్టేజీ మీదనే మెగాస్టార్ తో కలసి ఒక మెగా సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సెల్ఫి ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.

మొదట తాను 150 వ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాను రాలేను అని సున్నితంగా చిరంజీవి తిరస్కరిస్తే...అదేం కుదరదు మీ చిత్రానికి మేం ఇక్కడ శుభాకాంక్షలు తెలపాల్సిందే అంటూ ఆర్గనైజర్స్ ఒత్తిడి చేసారని అందుకే వెళ్లారని అంటున్నారు.

ఈ ఫొటోలో చూడండి.. ఎంతమంది నటీనటులు ఉన్నారో.. సుహాసిని, ఖుష్బూ, రాధిక, రాజేంద్రప్రసాద్,సాయి కుమార్, అల్లు అర్జున్, రానా, లక్ష్మి మంచు, శిరీష్, సమంత, శ్రుతి హాసన్, వరుణ్ తేజ, సుధీర్ బాబు, మెహ్రిన్, సుబ్ర అయ్యప్ప, మనారా చోప్పా, అల్లు అరవింద్ ఇలా అందరూ కలసి చాలా హ్యాపీగా ఫోజులిస్తున్నారు.

మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాసం రాదు అన్నట్లుగా ... కెమెరావైపే తీక్షణంగా చూస్తున్నారు. మొత్తానికి ఇంతమంది కలసి ఒక 'మెగా' సెల్ఫీ దిగడం మామూలు విషయం మాత్రం కాదు ఏమంటారు.

స్లైడ్ షోలో సైమా లో చిరంజీవి కు సంభందించిన మరిన్ని విశేషాలు

స్పెషల్ ఎట్రాక్షన్

చిరంజీవి ఈ పంక్షన్ లో ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారనటంలో సందేహం లేదు

లైఫ్ టైమ్ అవార్డ్ ఇస్తున్నప్పుడు...

ఇక చిరంజీవి అక్కడ గాయని పి. సుశీలకు లైఫ్ టైమ్ ఎఛీవ్ మెంట్ అవార్డ్ ను తన చేతులు మీదుగా అందించినప్పుడు ఆమె ఓ పాట పాడారు.

సుహాసిని పాట


ఆ అట్మాస్మియర్ లో చిరంజీవి లో ఆ ఉత్సాహం, సుహాసిని పాట పాడుతుంటే ...

చిరు , అలీ

మెగా స్టార్ తో అలీకు ఉన్న అనుభవం అలాంటిది ఇలాంటిది కాదు ..అందుకే చిరంజీవిని స్టేజిపై ఇలా

అందరి దృష్టీ

అందరి దృష్టీ

ఈ వేడుకలో అందరి దృష్టీ చిరంజీవి పైనే ఉందని ఆయన స్టేజీపైకి వచ్చినప్పుడు వాతావరణం చెప్తోంది.

ఫ్యాన్స్

ఫ్యాన్స్

ఆయన మాట్లాడుతున్నంతసేపు శంకర్ దాదా జిందాబాద్ అనే నినాదాలు అక్కడ మ్రోగుతూనే ఉన్నాయి.

అప్పటి హీరోయిన్స్ తో

అప్పటి హీరోయిన్స్ తో

చిరంజీవి తన తో చేసిన అప్పటి హీరోయిన్స్ తో కాసేపు సరదాగా ముచ్చటించారు.

ఈ తరంతోనూ

ఈ తరంతోనూ

ఇప్పటి తరం హీరోలతోనూ సరదాగా మాట్లాడుతూ ఇట్టే కలిసిపోయారు చిరు

ఎదురుచూపులు

ఎదురుచూపులు

చిరంజీవి ఎప్పుడు స్టేజ్ ఎక్కుతాడా అనే ఎదురుచూపులు ఇక్కడ కనిపించాయి.

సపోర్ట్ కోసం

సపోర్ట్ కోసం

తను ఎన్ని షూటింగ్ పనులు ఉన్నా సైమా వంటి ఉత్సవానికి సపోర్ట్ ఇవ్వటానికి ఆయన హాజరయ్యారు.

వేరే స్టేట్ స్టార్స్

వేరే స్టేట్ స్టార్స్

మిగతా స్టేట్స్ నుంచి వచ్చిన స్టార్స్ అంతా వచ్చి చిరంజీవిని పలకరిస్తూనే ఉన్నారు.

ఎటెన్షన్

ఎటెన్షన్

చిరంజీవి 150 వ చిత్రం ప్రకటించి షూటింగ్ ప్రారంభించటంతో అందరి దృష్టీ ఇటే ఉంది

మెగా పండుగ

మెగా పండుగ

చిరంజీవి అక్కడకి రాగానే ఈ వేడుక మొత్తం మెగా పండుగగా మారిపోయింది

ఆయన గురించి

ఆయన గురించి

చిరంజీవి గురించి చెప్తూంటే టప్పట్లు మ్రోగుతూనే ఉన్నాయి

తగ్గని స్టామినా

తగ్గని స్టామినా

ఆయన స్టేజి ఎక్కడగానే ఏ హీరోకు రానంత అప్లాజ్ చిరంజీవికి రావటంతో ఆయన తగ్గని స్టామినా గురించే మాట్లాడుకున్నారు.

షాక్

షాక్


చిరంజీవి ఈ వయస్సులోనూ ఫెరఫెక్ట్ ఫిజిక్ తో కనపడేసరికి ఆయనతో పనిచేసిన వారంతా లైవ్ లో చూసి షాక్ అయ్యారు.

అభినందనలు

అభినందనలు

చిరంజీవి 150 వ చిత్రం విజయవంతం కావాలని ఆయనకు పర్శనల్ గా విషెష్ చెప్పారు అందరూ.

English summary
SIIMA has felicitated Chiranjeevi and also wished him all the best for Mega150 that is coming very soon. At this event, whole of Telugu film fraternity actors went on stage to click a mega-selfie with Megastar itself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu