For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నన్ను అడ్రస్ లేకుండా వచ్చాడంటారు, కానీ ఆయన....: దాసరి గురించి చిరంజీవి

  By Bojja Kumar
  |
  దాసరి మనుషుల్లో మాణిక్యం..!

  151 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ద‌ర్శ‌కుడు డా.దాస‌రి నారాయ‌ణ‌రావు జీవిత చ‌రిత్ర‌ను 'తెర వెనుక దాస‌రి’ అనే పుస్త‌క రూపంలో తీసుకొచ్చారు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు. చిరంజీవి, మురళీ మోహన్ లాంటి పలువురు సినీ ప్రముఖులు దాసరి గురించి రాసిన వ్యాసాల సంకలనంతో రూపొందించిన ఈ పుస్తకావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. తొలి ప్ర‌తిని టి.సుబ్బ‌రామిరెడ్డి, రెండో ప్ర‌తిని కె.రాఘ‌వేంద్ర‌రావు అందుకున్నారు.

  దాసరి జీవితం ఎంతో మందికి స్పూర్తి

  దాసరి జీవితం ఎంతో మందికి స్పూర్తి

  చిరంజీవి మాట్లాడుతూ.....మనుషుల్లో మాణిక్యం అన్నా....ఈ సినీ పరిశ్రమలో తలమానికం అన్నా, సినీ కార్మికులకు అత్యంత భరోసా ఇచ్చే గుండె ధైర్యం అన్నా... ఆయన మరెవరో కాదు, ది గ్రేట్ దాసరి నారాయణ రావుగారు. ఆయన కీర్తి శేషుడే కాదు, కీర్తి విశేషుడు కూడా. ఒక దాతగా, దర్శకుడిగా, దార్శనికుడిగా ఆయన ఆర్జించినటువంటి కీర్తి విశేషమైనది. అలాంటి వ్యక్తి ఏ పని చేసినా సంచలనం. ఏ విజయం సాధించినా అది అపురూపం, అమోఘం, ఒక చరిత్ర. అలాంటి వ్యక్తి మన మధ్య లేక పోవడం ఎవరూ తీర్చలేని లోటు. కానీ ఇంత మంది గుండెల్లో ఆయన జీవించి ఉండటం అనేది ఎంతో మందికి స్పూర్తి దాయకం అన్నారు.

  అలాంటి వ్యక్తులు చాలా అరుదు

  అలాంటి వ్యక్తులు చాలా అరుదు

  అలాంటి వ్యక్తిపై ‘తెర వెనక దాసరి' అనే పుస్తకం తీసుకువచ్చే వ్యక్తి మట్టిలో మాణిక్యం అని చెప్పాలి. ఆయన మరెవరో కాదు పసుపులేటి రామారావుగారు. పసుపులేటి రామారావుగారు నేను ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో ఉన్నప్పటి నుండి పరిచయం. ఆరోజు ఎలా ఉన్నారో, ఈ రోజు అదే రకమైన ఆహార్యం, వ్యక్తిత్వంతో ఉన్నారు. ఏ మాత్రం మారలేదు. అలాంటి వ్యక్తులను చాలా అరుదుగా చూస్తుంటాం... అని చిరంజీవి అన్నారు.

  ఆ రోజుల్లో నా వద్ద పెద్దగా డబ్బు లేదు

  ఆ రోజుల్లో నా వద్ద పెద్దగా డబ్బు లేదు

  పసుపులేటి రామారావు నిజాయితీ ఎలాంటిదో చెప్పడానికి ఈ రోజుకీ మరిచిపోలేని సంఘటన ఒకటి ఉంది. నా గురించి ఎప్పుడో ఏదో పత్రికలో చిన్న వ్యాసం రాశారు. అపుడు నేను చాలా ఆనంద పడిపోయాను. ఆ రోజుల్లో అప్ కమింగ్ ఆర్టిస్టులకు అలాంటి ఆర్టికల్స్ వస్తే ఎనలేని భరోసా, గొప్ప కాన్పిడెన్స్ క్రియేట్ చేస్తుంది. అంతటి భరోసా, ప్రోత్సాహం ఇచ్చినందుకు ఆయన్ను పిలిపించి.... అప్పట్లో నా దగ్గర పెద్దగా డబ్బులు ఉండేవి కాదు, ఒక వంద రూపాయలు ఉంటే ఇవ్వబోతుంటే ఏదో షాక్ తగిలినట్లుగా చెయ్యి వెనక్కి తీసుకున్నారు. నేను డబ్బుల కోసం చేయలేదు, అది నా బాధ్యత... మీ లాంటి వారిని పరిచయం చేసి మీ గురించి చెబితే నా ప్రొఫెషన్ కు న్యాయం చేసినవాడిని అవుతాను అంటూ చాలా నిజాయితీగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎక్కడా ఏదీ ఆశించకుండా తనకు ఉన్నదాంట్లో జీవితం గడపటం అనేది చాలా రేర్ గా చూస్తాం. ఆయన నిజమైన అభ్యుదయవాది.... అని చిరంజీవి అన్నారు.

  ఉడతాభక్తి సాయం మాత్రమే చేశాం

  ఉడతాభక్తి సాయం మాత్రమే చేశాం

  దేనీకి ఆశించని వ్యక్తి ఈ రోజు ఇలాంటి బృహత్ కార్యం చేస్తున్నారు. పది మందికి స్పూర్తి దాయకంగా ఉండే ఈ పుస్తకాన్ని తీసుకురావడం ఆయన గురు భక్తికి, దాసరి నారాయణరావుగారి మీద ఉన్న అచంచలమైన ప్రేమకు నిదర్శనం. అలాంటి వ్యక్తి యొక్క జీవితం ఎంతో మందికి మార్గం దర్శకం కావాలి అనే సదుద్దేశ్యంతో ముందుకు రావడం హర్షణీయం. ఆయన చేస్తున్న కృషికి ఏదో ఉడతా భక్తిగా చేయూత ఇవ్వడం తప్ప మేము చేసింది ఏమీ లేదు.... అని చిరంజీవి అన్నాన్నారు.

  సుబ్బిరామిరెడ్డిగారు వెంటనే ఓకే చెప్పారు

  సుబ్బిరామిరెడ్డిగారు వెంటనే ఓకే చెప్పారు

  పుస్తకావిష్కరణ వీలైతే కొణిదెల ఆఫీసులోనో, మహా అయితే ప్రసాద్ ల్యాబ్స్ లో చేద్దాం అని అనుకున్నపుడు మెగా లెవల్లో చేద్దామని నేను చెప్పాను. అపుడు నాకు వెంటనే టి సుబ్బిరామిరెడ్డి గారు గుర్తుకు వచ్చారు. మనం పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటాం... నా పాత్రికేయ మిత్రుడు, నా చిరకాల మిత్రుడు పసుపులేటి రామారావుగారు పెద్ద మనసుతో ఒక గొప్ప వ్యక్తి గురించి పుస్తకాన్ని ఆవిష్కరించాలని కోరారు. ఇది మనకు ఉన్న ఫ్రెండ్షిప్ లో మీ హోటల్ ను వేదికగా చేసుకుంటాం. మీరు ఎంత వరకు సహకరిస్తారు అంటే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నేను ఆర్గనైజ్ చేస్తానని సుబ్బిరామిరెడ్డిగారు ముందుకు వచ్చారు.... అని చిరంజీవి తెలిపారు.

  ఎంతో మందికి ఇన్స్‌స్పిరేషన్

  ఎంతో మందికి ఇన్స్‌స్పిరేషన్

  ఈ పుస్తకం ఎంతో మందికి ఇన్స్‌స్పిరేషన్ గా ఉంటుంది. నేను అన్ని స్థాయిల నుండి వచ్చాను. అవకాశాలు వస్తాయా? రావా? ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలనా? లేదా? ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ కాన్ఫిడెన్స్, కష్టాన్ని నమ్ముకున్న నాలాంటి వారు ఎంతో మంది ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి వారికి ఈ పుస్తకం పూర్తిగా చదివితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.... అని చిరంజీవి తెలిపారు.

  ఏ అడ్రస్ లేకుండా ఇండస్ట్రీలోకి చిరంజీవి వచ్చాడు అంటారు, కానీ దాసరి

  ఏ అడ్రస్ లేకుండా ఇండస్ట్రీలోకి చిరంజీవి వచ్చాడు అంటారు, కానీ దాసరి

  ఏ అడ్రస్ లేకుండా ఇండస్ట్రీలోకి చిరంజీవి వచ్చాడు, ఈ రోజు ఇండస్ట్రీలో ఇంతటివాడయ్యాడు అని ప్రశంసలుగా నాకు చెబుతూ ఉంటారు. కానీ నాకు ఇన్స్‌స్పిరేషన్ దాసరిలాంటి వారు. వెనక ముందు ఎవరూ లేకుండా పాలకొల్లు నుండి ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ... ఇండస్ట్రీ మీద మక్కువతో ఆ ఉద్యోగాన్ని వదులుకుని ఇక్కడ తన మీద, తన టాలెంట్ మీద నమ్మకంతో వచ్చారు. ఈ కళామతల్లి టాలెంట్ ఉంటే ఎవరినైనా ఆదరిస్తుంది, అక్కున చేర్చుకుంటుందనే భరోసాతో ఆయన వచ్చిన విధానం ఒక మర్రివృక్షమై, వట వృక్షమై ఈ రోజు ఇంత మంది శిష్యులను పొంది ఈ సినీ పరిశ్రమకు గొప్ప సేవలు అందించారు. ఆయన గురించి చెప్పాలంటే దాసరి గారి ముందు దాసరి తర్వాత అన్నంత బ్రిడ్జిలాగా ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఈ పుస్తకంలో పొందు పరచయడం చాలా సంతోషంగా ఉంది.... అని చిరంజీవి అన్నారు.

  రామారావుగారిని అభినందిస్తున్నాను

  రామారావుగారిని అభినందిస్తున్నాను


  ఇండస్ట్రీలో కొనసాగుతున్నవారికి ఎక్కడైనా నిరుత్సాహం, ఒక్కోసారి అపజయాలతో డీలా పడిపోవడం జరుగుతుంది. అలాంటి ఈ పుస్తకం చదివితే ఆయన సాధించగలిగారు, మనం ఎందుకు సాధించలేం అనే ఒక భరోసా, వెన్ను తట్టులాగా ఈ పుస్తకం ఉంటుంది. ఇండస్ట్రీలో అందరం సాధించేశాము అన్న ఫీలింగ్ ఉన్న మాలాంటి వారందరికీ... రాఘవేంద్రరావు గారు కానీ, మురళీమోహన్ గానీ, మా లాంటి వారు అందరికీ ఈ పుస్తకం చదివితే సాధించిందేమీ లేదు. ఇంకా చాలా ఉందంటూ చెప్పే పుస్త‌కం ఇది. దాస‌రిగారి గురించి ఎంతో విష‌యాన్ని సంగ్ర‌హించి పుస్త‌క రూపంలో తీసుకొచ్చినందుకు రామారావుగారిని అభినందిస్తున్నాను. ఈ పుస్తకావిష్క‌ర‌ణ చేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను`` అన్నారు.

  English summary
  Chiranjeevi launches Tera Venuka Dasari Book. Allu Aravind, K Raghavendra Rao, C Kalyan, Tammareddy Bharadwaj, T Subbarami Reddy, Murali Mohan, Kodi Ramakrishna at the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X