స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డబుల్ ట్రీట్ ఫర్ మెగా ఫ్యాన్స్...
త్వరలో వరుడు కానున్న యువ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా కాలం తరువాత ఇక లక్ష్యంతో 'బద్రినాథ్'గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం తిమ్మాపూర్ లో జరుగుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు ఆరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్న కథానాయిక. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీత సారధ్యంలో వస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
వినాయక్, కీరవాణిల మొదటి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం మార్చి 27న రిలీజ్ కానుంది. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మగధీర తరహాలో విషువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నానా పతేకర్ ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు. మార్చి 6న పెళ్లి చేసుకోనున్న ఈ వరుడు వివాహానంతరం 'బద్రినాథ్'గా అదే నెలాఖరులో అభిమానులను అలరించనున్నాడు. సో ఒకే నెలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పర్సనల్ గాను, ప్రొఫిషినల్ గాను మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు.


Click it and Unblock the Notifications











