»   » బలహీన పరుస్తున్నారనుకోవడం లేదు: చిరంజీవి కామెంట్ తమ్ముడి గురించేనా?

బలహీన పరుస్తున్నారనుకోవడం లేదు: చిరంజీవి కామెంట్ తమ్ముడి గురించేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఏదో అభిప్రాయ బేధాలున్నట్లు..... రాను రాను మెగా అభిమానులు రెండు వర్గాలుగా డివైడ్ అవుతున్నారని, అందులో ఓ వర్గం మెగా ఫ్యామిలీకి సపోర్టుగా, మరో వర్గం పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్‌గా ఉంటున్నారనే ఓ వాదన ఉంది. ఆయా మెగా ఫంక్షన్లలో గొడవ చేసేది పవన్‌ను ఫాలో అయ్యే వర్గమే అనే ఓ ప్రచారం కూడా ఉంది.

తాజాగా తన 150వ చిత్రం ప్రమోషన్లో పాల్గొన్న చిరంజీవి.... ఇందుకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మీ ఫ్యామిలీలో ఎక్కువమంది హీరోలు ఉండటంతో అభిమానులు డివైడ్‌ అవుతున్నారనుకోవచ్చా?... అంటూ సాక్షి పత్రికకు చెందిన ప్రతినిధి చిరంజీవిని ప్రశ్నించారు.

చిరు సమాధానం ఇదీ

చిరు సమాధానం ఇదీ

ఆ ప్రశ్నకు చిరంజీవి ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. మీ ప్రశ్న డివైడ్‌ అవుతుంటే అని కాకుండా యునైట్‌ అవుతుంటే అనాలేమో. అభిమానులు బలోపేతం అవుతున్నారు. మా ఫ్యామిలీ హీరోలు నా ఇమేజ్‌ షేర్‌ చేసుకుంటూ నన్ను బలహీనపరుస్తున్నారు అనుకోవడం లేదు అంటూ సమాధానం ఇచ్చారు.

వారం రోజులు తిప్పించుకున్నారు, కుట్ర ఉందనుకోను

వారం రోజులు తిప్పించుకున్నారు, కుట్ర ఉందనుకోను

ప్రీరిలీజ్ ఫంక్షన్ వేదిక మార్పు... వెక కారణాలపై చిరంజీవి స్పందిస్తూ....విజయవాడలో ఈ ఫంక్షన్‌ చేయాలనుకున్న తర్వాత ఆఫీసర్స్‌ను సంప్రదించాం. ముందు ఇస్తామన్నారు. పర్మిషన్‌ కూడా ఇచ్చేశారు. తర్వాత 'మేం పొరపాటు పడ్డాం. కోర్టు స్టే ఉంది. ఒకవేళ ఇచ్చినా ఇంత మేరకే వాడుకోవాలి' అన్నారు. ఓ వారం రోజులు తిప్పించుకున్నారు. ఓకే చేయలేదు. ఆ తర్వాత గుంటూరు స్టేడియం అయితే అక్కడున్న అధికారులు ముందు ఓకే అని, ఆ తర్వాత ఇవ్వమన్నారు. అప్పుడు ప్రైవైట్‌ వెన్యూ అయిన హాయ్‌లాండ్‌ని ఎన్నుకున్నాం. ఏదేమైనా.. అనుమతి దొరక్కపోవడం వెనక ఏదో రాజకీయ కుట్ర ఉందని నేను అనుకోవడం లేదు. అధికారులకు ఏవో ఇబ్బందులు ఉండి ఉంటాయ్‌. పొలిటికల్‌గా ఏదో ఉందనే మాటని కొట్టిపారేస్తున్నా అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

వేడుకకు పవన్ రాకపై

వేడుకకు పవన్ రాకపై

ఈ వేడుకకు పవన్ వస్తున్నాడా? అనే ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ.....చరణ్‌ ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం. కల్యాణ్‌ బిజీగా ఉన్నాడు. నేనూ, తనూ డిసెంబర్‌ 17న నాన్నగారి ఆబ్దీకానికి కలిశాం అని చిరంజీవి సమాధానం ఇచ్చారు.

సినిమాలపై రాజకీయాలు చేయడంపై

సినిమాలపై రాజకీయాలు చేయడంపై

సినిమాలపై రాజకీయాలు చేయడంపై చిరంజీవి స్పందిస్తూ..... తమిళనాడులో సినిమాలు, పాలిటిక్స్‌ కలగలిసి ఉన్నాయి. హీరో విజయ్‌ చేసిన ఓ సినిమాకి థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. చివరికి 'ఇది ఎవర్నీ ఉద్దేశించి తీసిన సినిమా కాదు. పొలిటికల్‌గా ఎవర్నీ ఎయిమ్‌ చేయలేదు' అని ఆనాటి సీఎంకి విన్నవించుకున్నాక, సమస్య తీరింది. సినిమా అనేది క్రియేటివ్‌ ఫీల్డ్‌. దీని మీద రాజకీయ ప్రభావం ఉండకపోతే బాగుంటుంది... అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

స్ట్రెస్ ఫీలయ్యారా అనే ప్రశ్నకు..

స్ట్రెస్ ఫీలయ్యారా అనే ప్రశ్నకు..

150వ సినిమాకు సరైన కథ కోసం ఏడాది పాటు అన్వేషించా. నా ఇమేజ్ కి సెట్టయ్యేలా అభిమానులను అలరించడంతో పాటు సందేశాత్మకంగా ఉండే కథ కోసం చూసాం. ఎక్కడా పూర్తి స్థాయిలో సంతృప్తి పడే కథ రాలేదు. అప్పుడు 'కత్తి' చూశా...నాకు సరిపోతుంది అనిపించింది. నా ఇమేజ్‍‌కి తగిన విధంగా కొన్ని మార్పులు చేసామని చిరంజీవి తెలిపారు.

English summary
Megastar Chiranjeevi about 'Khaidi no 150' pre-release event permissions issue. Check out details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu