అద్భుతం రంగస్థలం.. సెట్‌ను సందర్శించిన మెగాస్టార్..
విభిన్న చిత్రాలను రూపొందించే దర్శకులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వారిలో డైరెక్టర్ సుకుమార్ ఒకరు. ప్రస్తుతం ఆయన రాంచరణ్, సమంతతో కలిసి రంగస్థలం అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం మార్చి 30న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. కాగా హైదరాబాద్‌లో రంగస్థలం కోసం ప్రతిష్ఠాత్మకంగా వేసిన సెట్‌ను మెగాస్టార్ చిరంజీవి సందర్శించడం ప్రముఖంగా మారింది.

1985 నాటి కాలపు నాటి కథతో సుకుమార్ రంగస్థలం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలుత గోదావరి జిల్లాలో మారుమూల ప్రాంతంలో చిత్రీకరించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కోసం గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే పల్లెటూరు సెట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. రంగస్థలం పేరుతో ఉండే సెట్ టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సందర్శించి ముచ్చటపడినట్టు సమాచారం.

ఈ సెట్‌ను రూపొందించిన ఆర్ట్ దర్శకులను ప్రశంసలతో ముంచెత్తారట. అంతేకాకుండా ఖర్చుకు వెనుకాడకుండా రూపొందించిన నిర్మాతలను అభినందించారట.


Click it and Unblock the Notifications











