»   » తెలంగాణలో ఓకే.., కానీ, ఆంధ్రాలో కూడా...!? గౌతమీ పుత శాతకర్ణి పన్ను మినహాయింపు వివాదం పై చిరు

తెలంగాణలో ఓకే.., కానీ, ఆంధ్రాలో కూడా...!? గౌతమీ పుత శాతకర్ణి పన్ను మినహాయింపు వివాదం పై చిరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖైదీ నెం.150 సినిమా కోసం మెగాస్టార్ ప్రమోషన్లలో భాగానే పాల్గొంటున్నాడు. యువహీరోలకి ఏమాత్రం తగ్గని ఉత్సాహం తో ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు, స్పెషల్ షోలూ అంటూ హడావిడి లో కూడా ఏమాత్రం అలసట, విసుగు కనిపించకుండా ఉంటున్నారు చిరు. పదేళ్ళుగా సినీ వాతావరణానికి కాస్త దూరంగానే ఉన్న చిరు అప్పుడప్పుడూ మొహమాటంగా స్టేజ్ ఎక్కి ఒకటీ రెండు మాటలు చెఒప్పటం తప్ప సినీ కాంట్రవర్సీ అనే విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.

అయితే అప్పుడు ఒక పొలిటీషియన్ గా ఉన్నాడు కాబట్టి మిగతా విషయాలని పట్టించుకోలేదేమో కానీ ఇటు రీ ఎంట్రీ అవగానే మళ్ళీ మునుపటి లాగానే సినిమా ఇష్యూలలో కూడా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాడు. అలా అని ఎవరినీ నొప్పించే లాగా కూడా కాదు... రీసెంట్ గా రాజుకున్న గౌతమీ పుత్ర శాతకర్ణి కి వినోదపు పన్ను మినహాయించటం పై గుణ శేఖర్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి రాసిన ఉత్తరం విషయమై స్పందించిన మెగా స్టార్ ఇలా స్పందించారు...

Megastar Chiranjeevi expressed his Opinion on Gunashekhar open letter to Andhra Pradesh CM Chandrababu Nayudu abut Tax exemption issue of his Movie Rudrama Devi

ఈ సందర్భంగా 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చారు కదా. మీ స్పందనేమిటని చిరును అడగ్గా ఆయన ఈ విధంగా స్పందించారు. ''గత చరిత్రను చూపించే సినిమాలకు రాయితీలు ఇవ్వడమనేది మంచిదే. అయితే 'రుద్రమదేవి'కి కూడా ఇచ్చున్నట్లయితే గనక మరింత న్యాయం చేసినట్లయ్యేది. రుద్రమదేవి కూడా ఓ చరిత్రకు సంబంధించిన సినిమానే.

గుణశేఖర్‌గారు కోట్లు ఖర్చుపెట్టి చేసిన సినిమా. దానికి తెలంగాణలో పన్ను మినహాయింపు లభించింది కానీ, ఆంధ్రాలో లభించలేదు. ఆ సినిమాకిచ్చి, ఈ సినిమాకీ ఇచ్చుంటే.. 'ఓహో.. ఈ తరహా సినిమాలకు ప్రోత్సాహకాలు లభిస్తాయ'ని అనుకోవచ్చు. దానికి ఇవ్వకపోవడం, దీనికి మాత్రం ఇవ్వడం విమర్శకు తావిస్తోంది''. అంటూ తన అభిప్రాయాన్నిఒ సిన్సియర్ గా చెప్పాడు మెగా స్టార్. మరి ఈ విషయం నిజంగానే పరిష్కారానికి మార్గమే అవుతుందో లేదంటే రాజకీయ రంగు పులుముకుని విమర్షలకు తావిస్తుందో చూడాలి ఎందుకంటే చిరు ఒక రాజకీయ పార్టీ లో కీలక సభ్యుడన్నదీ మర్చిపోకూడదు కదా...

English summary
Megastar Chiranjeevi expressed his Opinion on Gunashekhar open letter to Andhra Pradesh CM Chandrababu Nayudu abut Tax exemption issue of his Movie Rudrama Devi
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu