twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్.నారాయణమూర్తి పిలవగానే చేతులు కట్టుకొని వచ్చేసిన మెగాస్టార్.. చెప్పండి సార్ అంటూ..

    |

    మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో నేడు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, ఆర్.నారాయణమూర్తి, కొరటాల శివ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. ఇక ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న టికెట్ల రేట్ల విషయంపై ఒక కొలిక్కి రావాలని మాట్లాడడం జరిగింది. ఇక సమావేశం అనంతరం అందరూ వారి వివరణ ఇచ్చారు. అయితే మీడియాకు వివరణ ఇచ్చే క్రమంలో ఆర్.నారాయణమూర్తి వ్యవహరించిన తీరు హైలెట్ గా నిలిచింది. మెగాస్టార్ గురించి గొప్పగా మాట్లాడిన ఎర్రన్న ముందుగా ఆయనను దగ్గరకు పిలిపించుకున్న విధానం వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

    Recommended Video

    Tollywood Meets CM YS Jagan, 20 శాతం షూటింగ్ AP లోనే..!| Filmibeat Telugu
     చిరంజీవి నేతృత్వంలో..

    చిరంజీవి నేతృత్వంలో..

    ఆంధ్రప్రదేశ్ లో గతకొంత కాలంగా టికెట్ల రేట్ల సమస్య పై చాలామంది సినీ ప్రముఖులు చర్చలు జరిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న టికెట్ల రేట్లు ఏ మాత్రం న్యాయంగా లేవని అభ్యంతరాలు బాగానే వ్యక్త పరిచారు. ఇక ఎన్నిసార్లు చర్చలు జరిపినా కూడా లాభం లేకపోవడంతో నేడు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో మహేష్ బాబు, ప్రభాస్, ఆర్.నారాయణమూర్తి, రాజమౌళి, కొరటాల శివ ఇతర సినీ ప్రముఖులు సీఎంను కలుసుకొని ప్రత్యేకంగా చర్చలు జరపడం జరిగింది.

    త్వరలోనే కొత్త జీవో..

    త్వరలోనే కొత్త జీవో..

    ఇక సమావేశం అనంతరం అందరూ కూడా సీఎం ప్రతిస్పందన పై పాజిటివ్ గా స్పందించారు. అందరికి ఆమోదయోగ్యమైన విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారని , ఈ నెల మూడవ వారంలోనే కొత్త జీవో కూడా రాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలియజేశారు. ఇక అలాగే మహేష్ బాబు, రాజమౌళి కూడా మెగాస్టార్ ముందుండి ఈ విషయంలో సహకరించిన విధానానికి కృతజ్ఞతలు తెలిపారు.

    అడుక్కునే పరిస్థితి ఎదురైందని..

    అడుక్కునే పరిస్థితి ఎదురైందని..

    అయితే సమావేశం అనంతరం ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ మెగాస్టార్ గురించి కూడా చాలా గొప్పగా వివరణ ఇచ్చారు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చిన్న సగటు సినిమా మనుగడ కష్టతరంగా మారింది అని అయితే తరచుగా అన్ని ఫెస్టివల్ హాలిడేస్ లో కూడా పెద్ద సినిమాలకు ఎక్కువగా థియేటర్స్లో వస్తున్నాయని కానీ చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని అడుక్కునే పరిస్థితి ఎదురైందని అన్నారు.

     70 శాతం చిన్న సినిమాలే

    70 శాతం చిన్న సినిమాలే

    ఇక ఇండస్ట్రీలో 70 శాతం చిన్న సినిమాలే ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా విన్నవించుకోవడం జరిగింది. ఆయన కూడా తప్పకుండా చిన్న సినిమాల్లో థియేటర్స్ లభించేలా చర్యలు తీసుకుంటామని ఇండస్ట్రీలో కూడా అందరూ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఆ విషయంలో జగన్ గారికి అలాగే మంత్రి పేర్ని నాని గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని మూర్తి గారు తెలియజేశారు.

    చెతులు కట్టుకొని వచ్చిన మెగాస్టార్

    చెతులు కట్టుకొని వచ్చిన మెగాస్టార్

    ఇక మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఆర్.నారాయణమూర్తి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాలని ఆయనను ప్రత్యేకంగా దగ్గరకు పిలిచారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఎస్ సార్ అంటూ.. చేతులు కట్టుకొని ముందుకు రావడంతో ఆర్ నారాయణ మూర్తి వెంటనే అంత వద్దు సార్.. ప్లీజ్.. నా హృదయ పూర్వకంగా చెబుతున్నాను అనగానే మెగాస్టార్ కూడా పాజిటివ్ మై ఫ్రెండ్ అని సంభోదించారు. ఇక మీరు ఈ విషయం లో చాలా పెద్ద పాత్ర పోషించారని మీరు ఒక మెగాస్టార్ మాత్రమే కాదు ఆక్టోపస్ మాజీ మంత్రి పద్మభూషణ్ పార్టీ అధినేత ఏదైనా సరే మెగాస్టార్ చిరంజీవి గారిగా ఏపీ సీఎం గారితో అలాగే కెసిఆర్ గారికి ఇండస్ట్రీలోని అంశాలను తెలుపడం గొప్ప విషయం అని నారాయణమూర్తి అన్నారు.

    వాళ్ళని కూడా పిలవాలి..

    వాళ్ళని కూడా పిలవాలి..

    అలాగే నంది అవార్డులపై కూడా చర్చలు జరపాలని ఇండస్ట్రీలోని మనుగడను కాపాడాలని మెగాస్టార్ చిరంజీవి గారు ఆ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడాలని నారాయణమూర్తి అన్నారు. అలాగే పేర్ని నాని గారి గురించి మాట్లాడుతూ.. పిలిచేటప్పుడు ఇండస్ట్రీలో వ్యవస్థాపన పరంగా ఉన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫిలింఛాంబర్ వాళ్ళని కూడా ఆహ్వానించాలని అప్పుడే ఏ ఫీలింగ్ లేకుండా అందరికీ చాలా బాగుంటుంది అని ఆర్ నారాయణమూర్తి తెలియజేశారు.

    English summary
    Megastar chiranjeevi friendly behavior with R narayanaya murthy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X