»   » మూడు భాషల్లో "ఉయ్యాలవాడ", రోమాలు నిలబడేలా.... చిరు చెప్పిన సంగతులివే

మూడు భాషల్లో "ఉయ్యాలవాడ", రోమాలు నిలబడేలా.... చిరు చెప్పిన సంగతులివే

Posted By:
Subscribe to Filmibeat Telugu

  ఖైదీనెం 150 తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డేనా కాదా అన్న డైలమాలో చాలామందే ఉన్నారు. ఒకసారి కన్ ఫార్మ్ అనీ మరో సారి తూచ్..తూచ్..! వేరే మాస్ సినిమా అనీ ఏవేవో వార్తలు వినిపిస్తూ మరింత అయోమయానికి గురి చేసాయి. మొన్నటికి మొన్న హీరో శ్రీకాంత్ చెప్పాక కొంత నమ్మకం కుదిరింది జనాలకి.. అయినా ఇంకా ఎక్కడో అనుమానమే ఎందుకంటే ఇటు మెగా కాంపౌండ్ నుంచి గానీ, అటు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోయే సురేంద్ర రెడ్డి గానీ అధికారికంగా చెప్పకపోవటమే. అయితే ఇప్పుడు వచ్చిన సమాచారం తో మనం ఇక ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరు ఎంట్రీ పక్కా అని గట్టిగా ఫిక్స్ అయిపోవచ్చు.....

  నరిసింహారెడ్డి లవ్ స్టోరీ కూడా

  నరిసింహారెడ్డి లవ్ స్టోరీ కూడా

  సినిమాలో గెరిల్లా పోరాటాలతో పాటు అభిమానులను అలరించేలా ఉయ్యాలవాడ నరిసింహారెడ్డి లవ్ స్టోరీ కూడా ఉంటుందని టాక్. ఉయ్యాలవాడ చరిత్ర చెబుతూనే అభిమానులకు కావాల్సిన వినోదం పంచేలా సినిమాను ప్లాన్ చేస్తున్నారట. నిన్నా మొన్నటి వరకూఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు.

  భగత్ సింగ్ పాత్ర

  భగత్ సింగ్ పాత్ర

  ఆ మధ్య 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో చిరంజీవి మాట్లాడుతూ కెరీర్లో తాను భగత్ సింగ్ పాత్ర చేయలేక పోయాను. అందుకు బదులుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర చేస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. దాంతోనే 151 ఉయ్యలవాడ నే అని అంతా ఫిక్స్ అయిపోయారు.

  ప్రాంతీయ కథే అయినా

  ప్రాంతీయ కథే అయినా

  ఈ చిత్రం 'బాహుబలి' మాదిరిగా సరిహద్దులు దాటి యూనివర్సల్‌ సినిమా అనిపించుకోగలదని ఆయన నమ్ముతున్నారు. సరైన విధంగా నడిపించగలిగితే ప్రాంతీయ కథే అయినా ప్రపంచం మొత్తానికీ నచ్చే ఒక వీరుడి కథ గా తీయొచ్చని భావిస్తున్నారు. తమ వద్ద సరిపడా మెటీరియల్‌ లేకపోయినప్పటికీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథకి మంచి కమర్షియల్‌ సినిమా కాగలిగే స్క్రీన్‌ప్లేని సురేందర్‌ రెడ్డి రాసాడని చెప్పాడు చిరంజీవి.

  షూటింగ్ కి ఎక్కువ సమయం

  షూటింగ్ కి ఎక్కువ సమయం

  ఈ ప్రాజెక్ట్ పీరియాడికల్ మూవీ కావడంతో షూటింగ్ కి ఎక్కువ సమయం అవసరం కానుందని సమాచారం. అందుకే ఈ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' షూటింగ్ ను ఏప్రిల్ లోనే స్టార్ట్ చేసి మూవీని వచ్చే ఏడాది సమ్మర్ నాటికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని అనుకున్నారు గానీ.

  స్వాతంత్య్ర సమరం కంటే పదేళ్లకు ముందే

  స్వాతంత్య్ర సమరం కంటే పదేళ్లకు ముందే

  ఇంకా సమయం పట్టేటట్టే ఉంది. ఏదిఏమైనా, 1857 లో జరిగిన మొదటి భారత స్వాతంత్య్ర సమరం కంటే పదేళ్లకు ముందే దేశం కోసం ప్రాణం అర్పించిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు కనిపిస్తాడంటే.. అది సిల్వర్ స్క్రీన్ కు పండుగనే అనాలి.

  చిరంజీవి కన్ఫాం చేశారు

  చిరంజీవి కన్ఫాం చేశారు

  ఇప్పుడు మెగా 151పై బోలెడంత ఆసక్తి ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని సినిమాగా మలుస్తున్నారనే న్యూస్ ఉంది. ఇప్పుడీ విషయాన్ని చిరంజీవి కన్ఫాం చేశారు. అసలు ఆ కథనే ఎంచుకోవడానికి కారణాలు కూడా చెప్పారు. 'మన దేశంలో మొదటి తరం స్వాతంత్ర్య సమరయోధుడు.

  బ్రిటిష్ వాళ్ల గెజిట్లలో ఉయ్యాలవాడ గురించి

  బ్రిటిష్ వాళ్ల గెజిట్లలో ఉయ్యాలవాడ గురించి

  1857లో సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిషర్లతో పోరాటం సాగించాడు. బ్రిటిష్ వాళ్ల గెజిట్లలో ఉయ్యాలవాడ గురించి ఉంటుంది. ఝాన్సీ లక్ష్మీ బాయ్ నుంచి అల్లూరి సీతారామరాజు వరకు అందరూ ఆయన గురించి ప్రస్తావించారు' అన్నారు చిరు.'గతంలో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు అనుకునేవారు.

  మూలకథ పరుచూరి బ్రదర్స్

  మూలకథ పరుచూరి బ్రదర్స్

  కానీ ఇప్పుడిలాటి సినిమాలను చూస్తామని ప్రేక్షకులు నిరూపిస్తున్నారు. ఆ అంశాన్ని ఉయ్యాలవాడ మరోసారి రుజువు చేయడం ఖాయం' అన్న చిరంజీవి.. దీనికి మూలకథ పరుచూరి బ్రదర్స్ అందించగా.. బోలెడంత రీసెర్చ్ చేసి సురేందర్ రెడ్డి అద్భుతమైన స్క్రీన్ ప్లే అందించినట్లు చెప్పారు.

  తన స్టైల్ పంచ్ డైలాగ్స్

  తన స్టైల్ పంచ్ డైలాగ్స్

  ప్రస్తుతం ఉయ్యాలవాడ స్క్రిప్ట్ పై పరచూరి బ్రదర్స్.. సత్యానంద్.. భూపతి రాజా.. కణ్ణన లాంటి రచయితలు వర్క్ చేస్తుండగా.. బుర్రా సాయిమాధవ్.. వేమారెడ్డిలు డైలాగ్స్ రాస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. ఉయ్యాలవాడ మూవీలో తన స్టైల్ పంచ్ డైలాగ్స్ కూడా పేల్చనున్నట్లు తెలిపారు చిరంజీవి.

  హిందీ, తమిళంలో కూడా

  హిందీ, తమిళంలో కూడా

  ఈ చిత్రాన్ని హిందీ, తమిళంలో కూడా విడుదల చేసేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ముందుగా అనుకున్న దానికంటే బడ్జెట్‌ పెరుగుతున్నా కానీ తగ్గేది లేదని చిరంజీవి ఉద్ఘాటించారు. వార్‌ ఎపిసోడ్స్‌కి, సెట్స్‌కి, గ్రాఫిక్స్‌కి ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు పెడతామని, సరిగ్గా తీసి, సరిగ్గా మార్కెట్‌ చేస్తే ఇంకో బాహుబలి కాగలిగే సత్తా ఈ చిత్రానికి వుందని ఆయన అంటున్నారు.

  సెట్స్‌కి సంబంధించిన వర్క్‌ మొదలైంది

  సెట్స్‌కి సంబంధించిన వర్క్‌ మొదలైంది

  రవివర్మ సినిమాటోగ్రఫీ, రాజీవన్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ చేస్తున్నారని చిరంజీవి తెలిపారు. ఇప్పటికే సెట్స్‌కి సంబంధించిన వర్క్‌ మొదలైందని, ఆగస్టులో సినిమా ప్రారంభించి వచ్చే వేసవికి విడుదల చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. హీరోయిన్‌ని కూడా హిందీ, తమిళ మార్కెట్లని దృష్టిలో వుంచుకుని ఫైనలైజ్‌ చేస్తామని అన్నారు. చిరంజీవి కాన్ఫిడెన్స్‌ చూస్తుంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్ట్‌ తెలుగు సినిమా పరిశ్రమకి మరో గొప్ప సినిమా కాగలదనే నమ్మకం కలుగుతోంది.

  English summary
  It is known that Megastar Chiranjeevi will be next seen in the biopic of a great freedom fighter 'Uyyalawada Narasimha Reddy' Recently during an media interaction, Megastar spoke about this upcoming project. He said, 'Uyyalavada Narasimha Reddy' will be made with good technical values involving high end visual effects.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more