న‌ట‌సార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణకు చిరంజీవి- సురేఖ దంప‌తుల స్పెషల్ బర్త్ డే విషెస్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత సీనియర్ నటులలో ఒకరైన న‌ట‌నా సార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మూడు తరాల హీరోలతో నటించిన ఆయన ఎలాంటి పాత్ర చేసినా కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేవి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తనదైన శైలిలో నటించి పాత్రలకు సరైన న్యాయం చేసేవారు.

ఇక ఆయన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితోను స్నేహంగా ఉండేవారు. ప్రేక్షకుల ప్రేమతో ఆయన 86వ వసంతంలోకి అడుగుపెట్టారు. కైకాల స‌త్య‌నారాయ‌ణకు ఇండస్ట్రీ పెద్దలు సినీ ప్రముఖులు అందరూ కూడా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి - న‌వ‌ర‌స‌ న‌ట‌నా సార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ మ‌ధ్య అనుబంధం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వీరి కలయికలో వచ్చిన సినిమాలు బెస్ట్ క్లాసిక్ హిట్స్ గా నిలిచాయి.

య‌ముడికి మొగుడు, మెకానిక్ అల్లుడు, కొద‌మ సింహం, గ్యాంగ్ లీడ‌ర్, ఘ‌రానా మొగుడు, ఖైదీనంబ‌ర్ 786 అంటూ ఎన్నో హిట్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే చిరంజీవి క‌థానాయకుడిగా కైకాల కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. మెగాస్టార్ చిరంజీవితో తనకు మరచిపోలేని జ‌ర్నీ కొనసాగిందని వారికి తానంటే ఎంతో అభిమాన‌మ‌ని కైకాల చెబుతారు.

Megastar chiranjeevi special birthday wishes to Kaikala Satyanarayana

మెగాస్టార్ కూడా ఆయనను తండ్రి స‌మానులుగా గౌర‌విస్తారు. కైకాల‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంప‌తులు ఆదివారం ఫిల్మ్ నగర్ లోని కైకాల సత్యనారాయణ ఇంటికి వెళ్లి మరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కొంతసేపు ఆయనతో మాట్లాడి ఆరోగ్యం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెగాస్టార్ మీడియాకు ఈ విధంగా వివరణ ఇచ్చారు..

మన తెలుగు సినిమా చరిత్రలోనే కైకల సత్యనారాయణ గారు ఒక ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అయినటువంటి ఆయన నాకు మాకు కుటుంబ సభ్యులకు అత్యంత ఆప్తులు. నేడు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ముచ్చటించడం చాలా ఆనందంగా అనిపించింది.. అని మెగాస్టార్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X