twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి పేరుకు మార్పులు.. మీరు గమనించారా?.. ఆ ఎఫెక్ట్ తోనే!

    |

    అదేమిటి మెగాస్టార్ చిరంజీవి పేరు మార్చుకున్నారా? ఇది ఎప్పుడు జరిగింది? మాకు ఈ విషయం తెలియదే అనుకోకండి ఆయన పేరు మొత్తం మార్చుకోలేదు కానీ పేరులో ఒక అక్షరాన్ని చేర్చి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు. ఈ మధ్యకాలంలో టైం బ్యాడ్ అనుకుంటున్న నటీనటులు, రాజకీయ నాయకులు సైతం న్యూమరాలజీ ప్రకారం తమ పేర్లలో ఒక అక్షరం పెంచడానికి, తగ్గించడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇప్పుడు చిరంజీవి కూడా అదే బాటలో నడిచారని అర్థమవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే

    ఆచార్య డిజాస్టర్ గా

    ఆచార్య డిజాస్టర్ గా

    రాజకీయాల్లోకి వెళ్లి సినీ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150, సైరా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలు రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించాయి. కానీ తన కుమారుడితో కలిసి చేసిన ఆచార్య సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే కాదు తెలుగు సినీ చరిత్రలో కూడా భారీ డిజాస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

    వరుస సినిమాలు

    వరుస సినిమాలు

    ఈ సినిమా మొదలుపెట్టేనాటికి చిరంజీవి మరికొన్ని సినిమాలను కూడా లైన్లో పెట్టారు. వాటిలో మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం తెలుగు రీమేక్ భోళా శంకర్, మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ లూసిఫర్ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య, వెంకీ కుడుముల దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో ఒక సినిమా ఉన్నాయి.

    న్యూమరాలజిస్టుల సూచనతో

    న్యూమరాలజిస్టుల సూచనతో


    అయితే ఆచార్య డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసిన తర్వాత మెగాస్టార్ కాస్త ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఇలా కావడానికి ఏదైనా కారణాలు ఉన్నాయా అని వెలికి చూస్తున్న క్రమంలో ఆయన పేరులో మరో అక్షరం చేర్చితే కాస్త ఇలాంటి డిజాస్టర్ ఫలితాల నుంచి గట్టెక్కవచ్చు అని న్యూమరాలజిస్టులు సూచించారట. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిరంజీవిలో రెండు ఈ అక్షరాల పక్కన మరో ఇంగ్లీష్ ఈ అక్షరం చేర్చారు.

    మెగాస్టార్ స్టైలిష్ గా

    మెగాస్టార్ స్టైలిష్ గా


    తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గాడ్ ఫాదర్ సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి లుక్ ఒకదానిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ లుక్ తో పాటు ఆయన కారు నుంచి దిగి నడిచి వస్తున్న ఒక చిన్నపాటి వీడియో కూడా విడుదల చేశారు. ఇందులో సునీల్ మెగాస్టార్ రైట్ హ్యాండ్ లాగా కనిపిస్తుండగా సునీల్ దిగి కార్ డోర్ తీయగా మెగాస్టార్ స్టైలిష్ గా నడిచి వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

    పెద్ద విషయం కాకపోయినా

    పెద్ద విషయం కాకపోయినా

    ఇదే వీడియోలో మెగాస్టార్ చిరంజీవి పేరు మార్చుకున్న వ్యవహారం తెరమీదకు వచ్చింది. అయితే ఇదేమి పెద్ద విషయం కాకపోయినా సుమారు 150 రెండు సినిమాలతో టాలీవుడ్ మెగాస్టార్ అనిపించుకున్న ఆయన ఇప్పుడు పేరులో స్వల్ప మార్పు చేసుకున్న విషయం మీద చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఇకమీదట సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తారని మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    megastar chiranjeevi spelling changed with numerologist advice, his name was changed to Chiranjeeevi instead of chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X