»   »  గిన్నిస్ రికార్డ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న మెగా ఫ్యాన్స్

గిన్నిస్ రికార్డ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న మెగా ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి స్టార్.... ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరో వైపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అదే విధంగా అభిమానులనూ భారీ సంఖ్యలో ఏర్పరచుకున్నారు. యాక్టింగ్ టాలెంటుతో పాటు ఆయనలోని సేవా భావమే ఆయన్ను మెగాస్టార్ ను చేసింది.

చిరంజీవి తర్వాత ఆయన వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన స్టార్లందరూ ఆయన్ను ఫాలో అవుతూ సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. మెగా అభిమానులు సైతం సేవాభావాన్ని అలవరుచుకున్నారు. త్వరలో గా ఫ్యాన్స్ గిన్నిస్ రికార్డ్ సృష్టించేందుకు సిద్దమవుతున్నారు.

Megastar fans for Guinness Record

2016 మార్చి 27 న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మెగా అభిమానులు భారీ ఎత్తున రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఒక్క రోజులోనే 1,11,116 యూనిట్ల రక్తాన్ని సేకరించి మెగా ఫ్యాన్స్ పేరు మీద గిన్నిస్ రికార్డ్ నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు.

ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెగా అభిమాన సంఘాలు కసరత్తు చేస్తున్నాయి. ఎక్కడ ఎక్కడ రక్తదాన శిబిరాలు నిర్వహించాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. రక్తదానం చేయడానికి లక్షా పదకొండువేల నూట పదహారు మందిని సిద్ధం చేస్తున్నారు. ఈ రికార్డును నమోదు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
Rastra Chiranjeevi Yuvatha is planning huge blood donation camp for good reasons. They are hoping on collecting 1,11,116 blood units for mega power star Ram Charan's birthday to fall on March 27th, 2016 and are hoping to enter Guinness Book Of World Records.
Please Wait while comments are loading...