»   » ఉయ్యాలవాడ కష్టాలు : అసలు కథే లేదు....భారీ బడ్జెట్ రిస్క్ అవుతుందా???

ఉయ్యాలవాడ కష్టాలు : అసలు కథే లేదు....భారీ బడ్జెట్ రిస్క్ అవుతుందా???

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకు అఫీషియల్ గా అయితే ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ మధ్య 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో చిరంజీవి మాట్లాడుతూ కెరీర్లో తాను భగత్ సింగ్ పాత్ర చేయలేక పోయాను. అందుకు బదులుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర చేస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. 'ఖైదీ నంబర్ 150'తో బిగ్ హిట్ సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. తన తదుపరి సినిమాగా స్వాతంత్ర్య సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్రను ఎంచుకున్నాడు.

స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా సిద్ధమైందని

స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా సిద్ధమైందని

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా సిద్ధమైందని, ఆగస్టులో చిరంజీవి పుట్టిన రోజు నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది.చిరంజీవి ఆ ప్రకటన చేసినప్పటి నుండి అభిమానులు బాస్ 151 సినిమా అదే అని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఫ్యామేడ్ పోస్టర్లు కొన్ని ఇంటర్నెట్ లో హచల్ చల్ చేస్తున్నాయి.

ఇన్‌ఫర్మేషన్‌ ఎక్కడా లేదు

ఇన్‌ఫర్మేషన్‌ ఎక్కడా లేదు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి ఇప్పుడు ఒక ఇబ్బంది ఎదురైందట. ఉయ్యాలవాడ గురించి ఒక పేజీకి మించిన ఇన్‌ఫర్మేషన్‌ ఎక్కడా లేదు. బ్రిటిషర్లకి నరసింహారెడ్డి ఎదురు తిరిగాడని, వారి కోశాగారంపై దాడి చేసి కొంత డబ్బు పట్టుకుపోయాడని, తర్వాత అడవుల్లో అతడిని బంధించి ఉరి తీసి, తలని కొన్నేళ్ల పాటు వేలాడదీసారని మాత్రమే అందుబాటులో వుంది. ఈ ఇన్‌ఫర్మేషన్‌తో కమర్షియల్‌ కథ అల్లడం కష్టంగా వుందట.

ఓ సరికొత్త సందేహం

ఓ సరికొత్త సందేహం

అంతేకాదు అయితే రీసెంట్‌గా ఈ సినిమా కథకు సంబంధించి చిత్ర యూనిట్‌ను ఓ సరికొత్త సందేహం వెంటాడుతోందట. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన తమిళ వీరుడు వీరపాండ్య కట్టబ్రహ్మణ జీవిత గాధ కూడా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'కి దగ్గరగా ఉంటుందని సమాచారం.

వీరపాండ్య కట్టబ్రహ్మణ

వీరపాండ్య కట్టబ్రహ్మణ

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని ఆయన సొంత మనుషులే వెన్నుపోటు పొడిచి బ్రిటిష్ వారికి అప్పగించారని స్థానిక కథలు ఉన్నాయి. ఆ తర్వాత బ్రిటిష్ వారు నరసింహారెడ్డిని ఉరి తీశారు. వీరపాండ్య కట్టబ్రహ్మణను కూడా ఇదే విధంగా ఆయన మనుషులే వెన్నుపోటు పొడిచారని, ఆ తరువాత బ్రిటిష్ వాళ్లు ఉరితీసిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.

రెండు కథలు ఒకే రకంగా

రెండు కథలు ఒకే రకంగా

ఇలా రెండు కథలు ఒకే రకంగా ఉండటంతో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథలో ఏమైనా మార్పులు చేయాలా లేక యథావిధిగా తెరకెక్కించాలా అనే దానిపై దర్శకనిర్మాతలు తర్జనభర్జన పడుతున్నారట. 18వ శతాబ్దంలో ఓ దక్షిణ భారత సామ్రాజ్యం సీడెడ్‌ జిల్లాల్లోని(కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి) కొన్ని గ్రామాలకు నియమించిన పాలేగార్‌ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. నరసింహారెడ్డి సొంత గ్రామం కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ.

పాలేగాళ్ల వ్యవస్ధ

పాలేగాళ్ల వ్యవస్ధ

ఆ కాలంలో చాలా దక్షిణ భారత రాజ్యాల్లో పాలేగాళ్ల వ్యవస్ధ ఉండేది. ప్రజలకు రక్షణ కల్పించడం, పన్నులు వసూలు చేయడం, శాంతి భద్రతలను కాపాడటం, స్ధానిక న్యాయపాలన తదితర అధికారాలు కలిగివుండేవారు. అంతేకాకుండా ప్రాంతాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలను(డ్యామ్‌ల నిర్మాణం, వ్యవసాయంలో సాయం తదితరాలు) కూడా చేపట్టేవారు.

ఒక్క లైన్ తప్ప

ఒక్క లైన్ తప్ప

1857 సిపాయిల తిరుగుబాటుకు భారతదేశ మధ్యయుగ చరిత్రలో ఎంతో కీలకపాత్ర ఉంది. సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతదేశంలో జరిగింది. సిపాయిల తిరుగుబాటు కంటే ముందుగా ఆంగ్లేయులపై తిరుబాటు చేసిన పాలేగాళ్ళ గురించి చరిత్రకారులు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఉయ్యాలవాడ గురించి పూర్తిగా తెలిసిన వారు అతి కొద్దిమందే ఉన్నారు. ఈ ఒక్క లైన్ తప్ప ఉయ్యాలవాడ గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు....

సరిపడా కథ లేని లోటు

సరిపడా కథ లేని లోటు

సురేందర్‌ రెడ్డి దానిని ఒక దారికి తెచ్చినప్పటికీ సరిపడా కథ లేని లోటు కొట్టొచ్చినట్టు తెలుస్తోందని, దీనిపై నూట యాభై కోట్ల పెట్టుబడి పెట్టడం ఉత్తమం కాదని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. బాహుబలి మాదిరిగా యూనివర్సల్‌ అప్పీల్‌ తెచ్చుకోవడం కష్టం కనుక ఈ చిత్రాన్ని తెలుగు వరకే పరిమితం చేస్తే మంచిదని సూచిస్తున్నారు.

English summary
Megastar Chiranjeevi's new Project Uyyalawada Narasimhaa reddy Facing Problems With story line.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu