»   » హీరో రామ్‌కు కొత్త హీరోయిన్ రాం రాం.. నితిన్ వల్లనే తప్పుకొన్నదా?

హీరో రామ్‌కు కొత్త హీరోయిన్ రాం రాం.. నితిన్ వల్లనే తప్పుకొన్నదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో ఇంకా అడుగుపెట్టక ముందే మేఘా ఆకాశ్ హవా బాగానే కొనసాగుతున్నది. 'లై' చిత్రంలో నితిన్ పక్కన నటిస్తున్న ఈ భామ.. తాజాగా రామ్ పోతినేని సినిమా నుంచి తప్పుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాను నటించిన తొలి సినిమా ఇంకా విడుదల కాలేదుగానీ డేట్స్ లేవంటూ సినిమా నుంచి వైదొలగడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.

నితిన్‌తో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్

నితిన్‌తో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్

అందాల ముద్దుగమ్మ మేఘా ఆకాశ్ వరుసగా నితిన్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకటి లై చిత్రం కాగా, మరోటి త్వరలో సెట్‌పైకి వెళ్లనున్నది. లై చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకొంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెల ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.


Ram Pothineni Next Movie titled as 'Vunnadi Okate Zindagi'
డేట్స్ ప్రాబ్లం అంటూ రామ్‌కు బై బై

డేట్స్ ప్రాబ్లం అంటూ రామ్‌కు బై బై

ఈ మధ్యలో రామ్ పోతినేని నటిస్తున్న ‘ఉన్నది ఒక్కటే జీందగీ' అనే చిత్రంలో నటించడానికి మేఘా అంగీకరించింది. అయితే నితిన్ సినిమాకు, రామ్ సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుగుతుండటం వల్ల డేట్స్ సర్దుబాటు కాలేదట. అందుకే రామ్ సినిమా నుంచి అనూహ్యంగా వైదొలిగింది.


లావణ్య త్రిపాఠికి దక్కిన అవకాశం..

లావణ్య త్రిపాఠికి దక్కిన అవకాశం..

మేఘా ఆకాశ్ తప్పుకోవడంతో ఆ అవకాశం లావణ్య త్రిపాఠికి దక్కింది. రామ్ సరసన ‘ఉన్నది ఒక్కటే జిందగి' చిత్రంలో లావణ్య జతకట్టున్నారు. త్వరలోనే లావణ్య ఊటీలో ప్రారంభమయ్యే షెడ్యూల్‌కు అందుబాటులో ఉంటుందని విషయం నిర్మాతలు వెల్లడించారు.


రామ్‌తో రెండోసారి కిషోర్ తిరుమల

రామ్‌తో రెండోసారి కిషోర్ తిరుమల

ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ నటిస్తున్న చిత్రానికి కిషోర్ దర్శకత్వం వహించడం ఇది రెండోసారి. గతంలో నేను శైలజ అనే చిత్రానికి కిషోర్ దర్శకత్వం వహించారు. కుటుంబ, ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర విజయంపై నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.English summary
Actress Megha Akash says good bye to Hero Ram Pothineni. She she couldn't adjust her dates for Ram's film, because of Nithin's moive. Megha had signed two back-to-back projects with actor Nithiin, and one of the films includes 'Lie'. She has already started shooting for the second film with Nithiin. So she opted out the Ram's movie. Now Lavanya Tripathi has been roped in as a replacement for Megha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X