»   » పెళ్లి చేసుకుని మోసం చేసిందంటూ...సినీ తారపై కంప్లైంట్

పెళ్లి చేసుకుని మోసం చేసిందంటూ...సినీ తారపై కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సిని సెలబ్రెటీలపై ఎప్పుడూ ఏదో ఒక వివాదాలు వస్తూనే ఉన్నాయి. కొన్ని సార్లు అవి నిజమైతే..చాలా సార్లు అందులో నిజం లేదని తేలిపోతున్నాయి. కానీ ఈ లోగా ఆ సెలబ్రెటీలకు లేనిపోని తలనొప్పి. ఎందుకంటే మీడియాలో అనవసరమైన బ్యాడ్ ప్రాపగండ జరుగుతుందని వారు బాధపడతారు.

ఇంతకీ ఇప్పుడు ఇలా వార్తల్లోకి ఎక్కింది ఎవరూ అంటే...శ్రీకాంత్ సరసన లక్కీ అనే చిత్రంలో కనిపించిన హీరోయిన్ మేఘనారాజ్. ఆమె ఇప్పుడు చిత్రమైన వివాదంలో ఇరుక్కుని మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమెపై తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త జనార్దన్ ఫిర్యాదు చేసారు.

ఆ కంప్లైంట్ ఏదైనా సినిమాకు సంభందించినది అయితే పెద్దగా పట్టించుకునే పనిలేదు..కానీ ఇదో చిత్రమైన కంప్లైంట్. మేఘనా రాజ్ తనను పెళ్లాడి మోసగించిందంటూ జనార్దన్ బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు.

జనార్దన్ ...కొన్ని నెలల క్రితం బెంగళూరు పోలీస్ కమిషనర్ మేఘరిక్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయితే.. ఎలాంటి సాక్ష్యాలు చూపకపోవడంతో కేసును మూసేసినట్లు బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ లోకేష్ కుమార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ గురువారం మీడియాకు వెల్లడించారు.

అసలు...ఆ కంప్లైంట్ ఏమిటి..ఎందుకు కేసు మూసేసారు..దీనిపై మేఘనారాజ్ స్పందన ఏమిటి అనేది క్రింద చూద్దాం..

దొంగతనం

దొంగతనం

మేఘనా రాజ్ తనను పెళ్లాడి మోసగించడంతో పాటు వివాహానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా దొంగలించారని జనార్దన్ కంప్లైంట్ చేసాడు.

కమీషనర్ ని ఉద్దేశిస్తూ..

కమీషనర్ ని ఉద్దేశిస్తూ..

కొన్ని నెలల క్రితం బెంగళూరు పోలీస్ కమిషనర్ మేఘరిక్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

దాంతో...

దాంతో...

బెంగుళూరు ..జేపీనగర పోలీసులు ఈ కేసు దర్యాప్తును చేపట్టారు.

పోలీస్ స్టేషన్ కూ పిలిపించారు

పోలీస్ స్టేషన్ కూ పిలిపించారు

ఈ కేసు విషయమై జనార్దన్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వివరాలను సేకరించారు.

చూపలేకపోయారు

చూపలేకపోయారు

నటి మేఘనారాజ్‌తో వివాహమైనట్లుగా ఆయన ఎలాంటి సాక్ష్యాలనూ చూపలేకపోయారు.

చెప్పలేకపోయారు

చెప్పలేకపోయారు

బెంగళూరులో మేఘనారాజ్ నివాసం ఎక్కడున్నదీ కూడా చెప్పలేకపోయారు.

అర్దంకాక

అర్దంకాక

ఆధారరహిత ఫిర్యాదుగా భావించిన కమీషనర్ .. ఫిర్యాదు దశలోనే ఈ కేసును మూసేశారు.

పోలీస్ లు ఏమంటున్నారంటే..

పోలీస్ లు ఏమంటున్నారంటే..

జనార్దన్ ఆరోపణల్లో ఏ విధమైన లాజిక్ కనపడలేదు. తరుచుగా అతను వెర్షన్స్ మారుస్తున్నాడు

మేఘనారాజ్ ఏమందంటే..

మేఘనారాజ్ ఏమందంటే..

"నేను ఈ రోజే ఈ సంఘటన గురించి వింటున్నా...ఇది ఆధారహితమైన ఆరోపణ...అసలు కంప్లైంట్ ఇచ్చిన అతన్ని ఎప్పుడూ కూడా చూడలేదు ."

మేఘనా రాజ్ తల్లి ప్రమీలా జోషాయ్ మాట్లాడుతూ...

మేఘనా రాజ్ తల్లి ప్రమీలా జోషాయ్ మాట్లాడుతూ...

.'అసలు జనార్దన్ అనే వ్యక్తి ఎవరో కూడా మాకు తెలీదు. సినీ రంగంలో నా కూతురు ఎదుగుదలను చూసి సహించలేని కొందరు ఈ విధంగా దుష్ర్పచారానికి దిగుతున్నారు.'ని చెప్పారు.

లీగల్ గా

లీగల్ గా

తన కుమార్తెపై ఇలాంటి ఆరోపణలు చేసిన జనార్దన్‌పై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నాము అని ఆమె తల్లి తండ్రులు తెలిపారు.

పెళ్లి చేసుకుని మోసం: శ్రీకాంత్ హీరోయిన్ పై కంప్లైంట్

ట్విట్టర్ లో మేఘనా రాజ్ ఇలా...

పెళ్లి చేసుకుని మోసం: శ్రీకాంత్ హీరోయిన్ పై కంప్లైంట్

అలాగే...పోలీస్ లకు ధాంక్స్ చెప్తూ..

మరోసారి...

మరోసారి...

ప్రస్తుతం..

ప్రస్తుతం..

తమిళంలో కాదల్ సొల్లవందేన్, ఉయిర్‌తిరు 420, నందానందిత చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం కన్నడంలో నటిస్తున్న ఈ బ్యూటీ తెలుగు, మలయాళ భాషల్లోనూ కొన్ని చిత్రాలు చేసింది.

ప్రేమలో...

ప్రేమలో...

కన్నడ హీరో చిరంజీవి సార్జా ప్రేమలో పడ్డారని, ఇద్దరూ పార్టీలు, ఇతర కార్యక్రమాలకు చెట్ట‌పట్టాలేసుకు తిరుగుతున్నారని వార్త‌లు హల్‌చల్ చేస్తున్నా ఖండించలేదు కదా అసలు వాటిని పట్టించుకోలేదు.

అలా బయిటపడింది..

అలా బయిటపడింది..

చిరంజీవి సార్జా తమ్ముడు ధ్రువ పుట్టిన రోజును పురస్కరించుకుని మేఘ‌నారాజ్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ అలవాటులో పొరపాటు అన్నట్లు నా మరిదికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని పేర్కొంది. అలా మేఘ‌నారాజ్ నటుడు చిరంజీవి సార్జాతో తన ప్రేమని చెప్పకనే చెప్పేసింది.

చిరంజీవి సర్దా ఎవరోకాదు

చిరంజీవి సర్దా ఎవరోకాదు

చిరంజీవి సార్జా మరెవరో కాదు..యాక్షన్ కింగ్ అర్జున్‌కు మేనల్లుడే

English summary
Atress Meghana Raj has been caught in a controversy as a businessman has accused her of cheating him. Janardhan, a businessman based in Tamil Nadu, sent an email complaint to Bengaluru City Police Commissioner N S Megharikh claiming that Meghana had promised to marry him, but backed out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu