»   » ‘షాడో’ రిజల్ట్‌పై మెహర్ రమేష్ స్పందన

‘షాడో’ రిజల్ట్‌పై మెహర్ రమేష్ స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెహర్ రమేష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన 'షాడో' చిత్రం నిన్న విడుదలై మిక్సడ్, యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. సీని విమర్శకులు మాత్రం సినిమాలో పస లేదని తేల్చి పారేసారు. ప్రేక్షకుల్లో కొందరు సినిమా చెత్తగా రొటీన్ ఉందని అంటే...కొందరేమో యావరేజ్‌‍గా ఉందని, కామెడీ, పాటల కోసం ఒకసారి చూడొచ్చని అంటున్నారు.

ఇక దర్శకుడు మెహర్ రమేష్ సినిమాను నిలబెట్టడానికి తనదైన రీతిలో వ్యాఖ్యానించారు. 'షాడో మూవీ విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఆడియన్స్ అంతా ఫైట్స్, కామెడీ, సాంగ్స్, సెంటిమెంటు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, శ్రీనివాస్ రెడ్డి, రాజేష్‌లు వెంకీతో కలిసి పండించిన కామెడీ బాగా ఆస్వాదిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఫస్ట్ డే టాక్ సంగతి పక్కన పెడితే ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ సినిమాను ఆదరిస్తే తప్ప సినిమాకు పెట్టుబడి తిరిగొచ్చే పరిస్థితి లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తొలి రోజు సినిమాపై వచ్చిన నెగెటివ్, మిక్స్డ్ టాక్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపిందని పలువురు పంపిణీ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాష్‌ రెడ్డి, ఆదిత్యమీనన్‌, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్‌, రావురమేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్‌, గోపిమోహన్‌. మాటలు: కోనవెంకట్‌, మెహర్‌ రమేష్‌, సంగీతం: తమన్‌. కెమెరా: ప్రసాద్‌, మూరెళ్ల, ఎడిటింగ్‌, మార్తాండ్‌, కె.వెంకటేష్‌. ఆర్ట్‌: ప్రకాష్‌ ఏ ఎస్‌. ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి. అజరుకుమార్‌ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.

English summary

 "Shadow Biggest opening in Victory Venkatesh's career, All Audiences Enjoying the Fights, comedy, sentiment and Songs done by him. MSN comedypeaks" director Mehar Ramesh tweeted.
Please Wait while comments are loading...