»   » అల్లు శిరీశ్ తో అల్లరి పిల్ల : ఇంతకీ ఎవరా భామ

అల్లు శిరీశ్ తో అల్లరి పిల్ల : ఇంతకీ ఎవరా భామ

Posted By:
Subscribe to Filmibeat Telugu

గౌరవం, కొత్తజంట సినిమాలతో నిరాశపరిచిన శిరీష్, కొంత గ్యాప్ తీసుకొని ప్రస్తుతం శ్రీరస్తు శుభమస్తు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. త్వరలోనే శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అల్లు శిరీష్.

ఆ సినిమాపై పూర్తి నమ్మకంగా వున్న ఆయన వరుసగా ,,సినిమాల్ని ప్లాన్ చేసుకుంటున్నాడు. శ్రీరస్తు శుభమస్తు పూర్తయిన వెంటనే.. ఎంవీఎన్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అల్లు శిరీష్. ఇప్పటికే ఆ సినిమా ప్రారంభమైంది కూడా. అందులో హీరోయిన్ గా మెహరీన్ ని సెలెక్ట్ చేసేశారు.

ఓ ప్రేమకథతో తెరకెక్కుతున్న ఆ సినిమాకి మెహరీన్ అయితేనే బాగుంటుందని చిత్రబృందం ఫిక్సయ్యిందట. ఆమె కూడా ఒప్పుకోవడంతో సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ మెహరీన్.

Mehreen in Allu Sirish's New Movie

తొలి చిత్రమే అయినా మంచి నటనతో ,,ఆకట్టుకుంటుంది. అచ్చమైన తెలుగమ్మాయిలాగా తెరపై కనిపించింది. దీంతో తెలుగు ఇండస్ట్రీ ఆమెపై ప్రత్యేకంగా కాన్సంట్రేట్ చేసింది. దీంతో మెహరీన్ కి ఆఫర్లమీద ఆఫర్లు వెళుతున్నాయట. కానీ ఆమే ఆచితూచి అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది మెహరీన్. అదే జోరులో మరో మెగా హీరో అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలోనూ హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది. వరుసగా ఇద్దరు మెగా హీరోలతో సినిమాలు చేస్తూ మెగా కాంపౌండ్ మీద కన్నేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది...

English summary
Mega Hero Allu Sireesh is going to team up with "Krishna Gaadi Veera Prema Gaadha" fame Mehreen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu