For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చరణ్, శంకర్ సినిమా సీక్రెట్ లీక్ చేసిన శ్రీకాంత్: రెండు పాత్రలు అంటూ షాకిచ్చిన సీనియర్ హీరో

  |

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్థాయి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో మన హీరోల స్టామినా కూడా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలకూ అర్థం అయింది. దీంతో మన స్టార్లతో సినిమాలు చేసేందుకు వేరే పరిశ్రమలకు చెందిన దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఇలా పలు చిత్రాలు పట్టాలపైకి కూడా ఎక్కేశాయి. ఈ క్రమంలోనే తమిళ సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ దర్శకుడు శంకర్‌.. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌తో జతకట్టాడు. వీళ్లిద్దరి కలయికలో ఇప్పుడు ఓ మూవీ రూపొందుతోంది. తాజాగా దీని గురించి సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తద్వారా ఓ సీక్రెట్‌ను కూడా లీక్ చేసేశాడు. ఆ సంగతులు మీకోసం!

  దిగ్గజ దర్శకుడితో రామ్ చరణ్ మూవీ

  దిగ్గజ దర్శకుడితో రామ్ చరణ్ మూవీ

  ప్రస్తుతం రామ్ చరణ్ RRR, ఆచార్య మూవీలు చేస్తున్నాడు. ఈ చిత్రాల షూటింగ్‌లు దాదాపుగా పూర్తయ్యాయి. వీటి తర్వాత అతడు చేసే సినిమాపై ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో చెర్రీ.. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ భారీ స్థాయిలో రూపొందనుంది.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  దాన్ని ఆపి.. దీన్ని మొదలెట్టిన శంకర్

  దాన్ని ఆపి.. దీన్ని మొదలెట్టిన శంకర్


  కమల్ హాసన్‌తో డైరెక్టర్ శంకర్‌ ఎప్పుడో'భారతీయుడు 2' అనే ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే, కొన్ని వివాదాల కారణంగా అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో నిర్మాణ సంస్థతో ఆయనకు విభేదాలు రావడంతో ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. కానీ, ఈ మధ్యే దీనికి కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో శంకర్.. రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాపై పూర్తిగా ఫోకస్ చేశారు.

  అప్పుడే అవన్నీ కంప్లీట్.. వాళ్ల ఎంట్రీ

  అప్పుడే అవన్నీ కంప్లీట్.. వాళ్ల ఎంట్రీ

  రామ్ చరణ్‌ సినిమా కోసం శంకర్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టి.. దాదాపుగా అన్నింటినీ పూర్తి చేసేశారు. ఈ క్రమంలోనే ఈ మూవీ కాస్టింగ్‌‌ను కూడా కంప్లీట్ చేసేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జయరాం, శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులను ముఖ్య పాత్రలకు ఎంపిక చేశారు. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్, హీరోయిన్‌గా కియారాను తీసుకున్నారు.

  హాట్ హాట్‌గా రెచ్చిపోయిన మంచు లక్ష్మి: తొలిసారి అందాలన్నీ కనిపించేలా ఘాటు ఫోజులు

  వైభవంగా మొదలు... స్టార్ల వచ్చి అలా

  వైభవంగా మొదలు... స్టార్ల వచ్చి అలా

  శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను సెప్టెంబర్ 8న అంగరంగ వైభవంగా జరిపించారు. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దీంతో ఈ వేడుక ఎంతో సందడిగా సాగింది. ఆరోజు అందరూ బ్లాక్ కలర్ డ్రెస్‌లతో వచ్చి అంచనాలు పెంచేశారు.

  ఆ సినిమా సీక్రెట్ లీక్ చేసేసిన శ్రీకాంత్

  ఆ సినిమా సీక్రెట్ లీక్ చేసేసిన శ్రీకాంత్

  రామ్ చరణ్.. శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ - చరణ్ మూవీకి సంబంధించిన కీలక విషయానలు వెల్లడించారు. ఇందులో తన పాత్ర ఎవరూ ఊహించని విధంగా డిజైన్ చేశారంటూ లీక్ చేసేశారు.

  బికినీ ఫొటో అడిగిన కుర్రాడికి అనుపమ ఆఫర్: అడ్రెస్ పంపమంటూ లైవ్‌లోనే ఊహించని విధంగా!

  రెండు పాత్రలు అంటూ షాకిచ్చిన హీరో

  రెండు పాత్రలు అంటూ షాకిచ్చిన హీరో


  శంకర్ సినిమాలో తన పాత్రను గురించి వెల్లడిస్తూ.. 'ఈ సినిమాలో నా రోల్ ఎంతో స్పెషల్‌గా ఉంటుంది. అంతేకాదు, ఈ మూవీలో నేను రెండు పాత్రల్లో కనిపిస్తాను. అందులో ఒకటి యంగ్ గెటప్. ఇంకోటి ఓల్డ్ మ్యాన్ గెటప్. నా రోల్స్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇక దీని గురించి ఇప్పుడే ఏమీ చెప్పను' అన్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.

  English summary
  Mega Power Star Ram Charan Now Doing a film with S. Shankar. Now Meka Srikanth Reveal His Role in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X