»   » డైరక్టర్ వంశీ... కొత్త సినిమా టైటిల్...ట్రైలర్ (వీడియో)

డైరక్టర్ వంశీ... కొత్త సినిమా టైటిల్...ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పెద్ద వంశీ సినిమాలంటే ప్రేక్షకలోకంలో ఓ విధమైన అభిమాననం,గుర్తింపు ఉన్నాయి. లేడీస్ టైలర్, అన్వేషణ, సితార, అవును ...వాళ్లు ఇష్టపడ్డారు వంటి డిఫెరెంట్ చిత్రాలు అందించిన ఆయన ఈ మధ్యన యూత్ ట్రెండ్ పట్టుకోలేక పూర్తిగా వెనకపడ్డారు. ఎంతలా అంటే...సినిమా రిలీజ్ ఆగిపోయేటంత.. ఆ చిత్రం 

Mellagaa Thattindi Manasu Talupu Theatrical Trailer

అజ్మల్‌, నిఖితా నారాయణ్‌ జంటగా నటించిన చిత్రం 'తను మొన్నే వెళ్లిపోయింది'. వంశీ దర్శకత్వం వహించిన 25వ చిత్రమిది.

అయితే ఈ సినిమా పేరు ఇప్పుడు మారింది. 'మెల్లగా... తట్టింది మనసు తలుపు!' అని కొత్తగా నామకరణం చేసి విడుదల చేస్తున్నారు. డి. వెంకటేష్‌ నిర్మాత. సోమవారం హైదరాబాద్‌లో ప్రచార చిత్రాన్ని, లోగోను చిత్ర దర్శకుడు వంశీ, రచయిత వెన్నెలకంటి సంయుక్తంగా విడుదల చేశారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.


వంశీ మాట్లాడుతూ ఆగిపోయిన సినిమాను తిరిగి మొదలుపెట్టి విడుదల చేస్తున్నందుకు నిర్మాతకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు. అజ్మల్‌ చెబుతూ ''వంశీగారి సినిమా అనగానే చిక్కనైన తెలుగు కథలు, చక్కని పేర్లు గుర్తొస్తాయి. పసందైన సంగీతం ఉంటుంది. అవన్నీ ఈ సినిమాలోనూ ఉంటాయి. విచిత్ర కోణంలో సాగే ప్రేమకథ'' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... నాకు వంశీగారంటే ఎంతో అభిమానం. చక్కటి కుటుంబ విలువల మేళవింపుతో తెరకెక్కించిన అందమైన ప్రేమకథా చిత్రమిది. వంశీ మార్క్ కామెడీతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

Mellagaa Thattindi Manasu Talupu Theatrical Trailer

తెలుగు చిత్రసీమ గర్వించే దర్శకుడైన వంశీతో కలిసి పనిచేయడం ఆనందంగా వుందని గీత రచయిత వెన్నెలకంటి తెలిపారు. పొయెటిక్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అందరి హృదయాల్ని హత్తుకుంటుందని కథానాయిక నిఖిత నారాయణ్ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఆర్.వి.సుబ్బు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, మాటలు: చందు, కెమెరా: యం.వి.రఘు, ఆర్ట్: రవీంద్రనాథ్ ఠాగూర్, కొరియోగ్రఫీ: స్వర్ణ, పాటలు: ప్రవీణ్ లక్మ, సంగీతం: చక్రి, సమర్పణ: నిఖితశ్రీ, నిర్మాత: డి. వెంకటేష్, దర్శకుడు: వంశీ.

English summary
Vamsy's latest movie title changed from Tanu Monne Vellipoyindi to Mellagaa Thattindi Manasu Talupu.
Please Wait while comments are loading...