»   » హీరో సూర్య ‘మేము’ రిలీజ్ వాయిదా పడింది

హీరో సూర్య ‘మేము’ రిలీజ్ వాయిదా పడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్‌స్టార్‌ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘పసంగ`2' తెలుగులో ‘మేము' పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే. అమలాపాల్‌, బిందుమాధవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకుడు. ఇప్పటివరకు పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలు అసాధారణ విజయం సాధించి ఉండడానికి తోడు.. ‘పసంగ`2' చిత్రాన్ని ఆ చిత్ర కథానాయకుడు సూర్య నిర్మిస్తుండడంతో..ఈ సినిమాకు గల క్రేజ్‌ రోజురోజుకూ పెరుగుతోంది.

ఈ సినిమాను డిసెంబర్ 4న విడుదల చేస్తున్నట్లు ఇటీవల నిర్మాతలు ప్రకటించారు. ఏమైందో తెలియద కానీ ఉన్నట్టుండి సినిమా వాయిదా పడింది. డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 4న ఇదర పెద్ద సినిమాల పోటీ కూడా లేదు. మరి వాయిదాకు గల కారణం ఏమిటో తెలియదు.


ఈ చిత్రాన్ని తెలుగులో సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి నిర్మిస్తుండగా.. సూర్య-కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ప్రసాద్‌ సన్నితి-తమటం కుమార్‌రెడ్డి సహ నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది.


'Memu' release postponed

సాయిమణికంఠ క్రియేషన్స్‌ అధినేత-చిత్ర నిర్మాత జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తమిళ`తెలుగు భాషల్లో కలిపి వంద కోట్లకు పైగా మార్కెట్‌ కలిగిన సూర్య నటిస్తూ.. తమిళంలో నిర్మిస్తున్న ‘పసంగ-2' చిత్రాన్ని ‘మేము' పేరుతో తెలుగు ప్రేక్షకుకు అందించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. సూర్య చేతుల మీదుగా విడుదలైన ‘మేము' ఆడియోకు చాలా మంచి స్పందన వస్తోంది. డిసెంబర్‌ 24న ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ‘మనం, దృశ్యం' చిత్రాల కోవలో ‘మేము' ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది' అన్నారు.


‘పిశాచి' ఫేం అరోల్‌ కొరెల్లి సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి పాటలు: వెన్నెలకంటి-చంద్రబోస్‌-సాహితి, సంభాషణలు: శశాంక్‌ వెన్నెలకంటి, సహ నిర్మాతలు: ప్రసాద్‌ సన్నితి-తమటం కుమార్‌రెడ్డి, సమర్పణ: సూర్య-కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌ !!

English summary
Surya's upcoming film 'Memu' releasing on 24th december.
Please Wait while comments are loading...