For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అర్జున్‌పై మీటూ ఆరోపణలు: హీరోయిన్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు, ముదిరిన వివాదం!

  |
  #MeToo : Prakash Raj Supports Sruthi Hariharan

  #మీటూ ఉద్యమంలో భాగంగా కన్నడ నటి శృతి హరిహరన్ ప్రముఖ నటుడు, యాక్షన్ స్టార్ అర్జున్ సార్జా మీద ఆరోపణలు చేయడం సౌత్ ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసింది. #మీటూ ఉద్యమం మొదలైన తర్వాత వేధింపుల ఆరోపణలో వెలుగులోకి వచ్చిన అతిపెద్ద స్టార్ ఇతడే. అయితే ఈ వ్యాఖ్యలును అర్జున్ ఖండించారు.

  కన్నడ చిత్రం విస్మయ (తెలుగులో 'కురుక్షేత్రం) చిత్రీకరణ సమయంలో ఒక రొమాంటిక్ సీన్ రిహార్సల్ సమయంలో అర్జున్ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, తన అనుమతి లేకుండానే దగ్గరకు లాక్కుని వీపు మీద కింద నుంచి పై వరకు అసభ్యంగా టచ్ చేశాడని శృతి హరిహరన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

  అర్జున్ క్షమాపణ చెప్పాలి: శృతి హరిహరిన్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు

  అర్జున్ క్షమాపణ చెప్పాలి: శృతి హరిహరిన్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు

  అయితే శృతి హరిహరన్‌కు మద్దతుగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, కన్నడ యూటర్న్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నిలవడంతో ఈ వివాదం మరింత ముదిరినట్లయింది. ఆ రోజు జరిగిన దానికి అర్జున్ సార్జా క్షమాపణలు చెప్పలని ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్ సూచించడం హాట్ టాపిక్ అయింది.

  #మీటూ: యాక్షన్ స్టార్ అర్జున్ పేరు బయటపెట్టి హీరోయిన్ సంచలనం!

  ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే...

  ‘శ్రుతి టాలెంట్ ఉన్న నటి. ఆమెకు నాతో పాటు, ఇతర కళాకారుల మద్దతు ఉంటుంది. అర్జున్‌ ఇప్పటికైనా మేల్కొని ఆమెకు బహిరంగ క్షమాపణలు చెబితే మంచిది. ఆయన అలా చేశారా? లేదా.. అన్నది నేను చూడలేదు. నటి చేసిన ఆరోపణలను అర్జున్‌ ధైర్యంగా స్వీకరించాలి. రిహార్సల్ సమయంలో వీపును తడిమిన విషయంలో ఆమె చేసిన ఆరోపణలకు అర్జున్‌ సమర్థించుకునే బదులుగా, క్షమాపణలు చెబితే బావుంటుంది' అని ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యానించారు.

  నా కొడుకును అనే అర్హత ప్రకాష్ రాజ్‌కు లేదు: అర్జున్ తల్లి

  నా కొడుకును అనే అర్హత ప్రకాష్ రాజ్‌కు లేదు: అర్జున్ తల్లి


  నా కుమారుడిని తప్పుబట్టే అర్హత ప్రకాష్ రాజ్‌కు లేదు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న అతడు ఒక వివాహం గురించి ప్రపంచానికి తెలియకుండా దాచి పెట్డాడు. అలాంటి వ్యక్తా? నా నా కుమారుడికి హితబోధ చేసేది? అంటూ అర్జున్ తల్లి లక్ష్మీదేవమ్మ మండి పడ్డారు.

  ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి ఉంటే తన కూతురును పంపుతాడా?

  ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి ఉంటే తన కూతురును పంపుతాడా?

  కన్నడ చిత్ర సీమలో లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ లాంటివి ఉన్నాయని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. నా కుమారుడు 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాడు. ఇక్కడ అలాంటి పరిస్థితి ఉంటే ఒక నటిని ఎలా పెళ్లి చేసుకుంటారు? లైంగిక వేధింపులు ఉంటే తన కుమార్తెను ఈ రంగంలోకి పంపేవాడా? అని లక్ష్మీదేవమ్మ ప్రశ్నించారు.

  అప్పుడే చెప్పాల్సింది...

  అప్పుడే చెప్పాల్సింది...


  శృతి హరిహరన్ ఆరోపణలను చిత్ర దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ సైతం ఖండించారు. షూటింగ్ సమయంలో ఆమె ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఇపుడు ఉన్నట్టుండి ఇలా మాట్లాడటంతో సాకైనట్లు తెలిపారు. అర్జున్ ఆపుడు రొమాంటిక్ సీన్లను తగ్గింమన్నారు. పడకగదిలో భార్యను దగ్గరగా తీసుకున్న సన్నివేశం ఇలా ఉంటే బాగుంటుందని అందరి ముందూ శృతి హరిహరన్‌తో రిహార్సల్‌ చేసి చూపించారు. అపుడు ఆమె ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు.

   శృతికి బెదిరింపులు

  శృతికి బెదిరింపులు

  ‘అర్జున్‌పై తాను ఆరోపణలు చేసినప్పటి నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని శృతి హరిహరన్‌ మరో సంచలన ప్రకటన చేశారు. పబ్లిసిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదని, ఆయన చేసింది నాకు నచ్చలేదు కాబట్టే చెప్పాను. షూటింగ్ సమయంలో రిసార్టుకు వెళదాం, డిన్నర్‌కు వెళదామని అర్జున్ చాలా సార్లు అడిగినా తాను తిరస్కరించానని గుర్తు చేసుకున్నారు.

  English summary
  MeToo: Sruthi Hariharan receives support Prakash Raj. He mentioned in a tweet, “Sruthi Hariharan is a very talented actor. And let’s not forget, Arjun Saraj is a seasoned actor and a pride of Kannada cinema. But, we should also understand the helplessness, the humiliation and the pain that Sruthi has gone through alone all these days. Even as Arjun has denied allegations, there is nothing wrong in seeking an apology for his behavior at the time. It will show his magnanimous. Knowing or unknowingly, we men have failed to understand the sensitiveness of the needs of women since time immemorial. And it’s equally true that even women have been oblivious to their rights. Hopefully, the #MeToo movement will end the helplessness, humiliation, harassment that woman have faced for centuries. I support Sruthi Hariharan and also other women who have faced harassment.”
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X