»   »  మెట్రో రైల్ స్టేషన్లో రామ్ చరణ్ మూవీ షూటింగ్ (ఫోటోస్)

మెట్రో రైల్ స్టేషన్లో రామ్ చరణ్ మూవీ షూటింగ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ చిత్రంలో రాంచరణ్ న్యూ లుక్ లో కనిపించబోతున్నారు. క్యారెక్టర్ పరంగా చరణ్ స్టన్నింగ్ లుక్ తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. చెర్రీ దీని కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. డైట్ విషయంలో కూడా చాలా మార్పులు చేసారు. కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నారు.

విభిన్నమైన కథాంశంతో రాం చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది.

ఈ నెల 22నుంచి హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ పార్ట్ చిత్రీకరించారు. మెట్రో రైల్ స్టేషన్లో కూడా కొన్ని సీన్లు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఇటీవల ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ మెట్రో స్టేషన్ ను తన టీంతో కలిసి వచ్చి పరిశీలించారు.

హైదరాబాద్ షెడ్యూలర్ పూర్తయిన తర్వాత జూన్ నెల 20 నుంచి కాశ్మీర్ లో కీలకమైన షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. రకుల్ ప్రీత్ అందచందాలు, అరవింద్ స్వామి పెర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి.

ధ్రువ

ధ్రువ


ఈ మధ్య సరైన హిట్ లేని రామ్ చరణ్ ఈ సినిమాపై బోలెడు అంచనాలు పెట్టుకున్నారు.

నిర్మాత మాట్లాడుతూ....

నిర్మాత మాట్లాడుతూ....


రామ్ చరణ్ ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం బాగా కష్టపడుతున్నాడు. తనను తాను డిఫరెంట్ లుక్ లో ప్రెజెంట్ చేసుకోబోతున్నాడు. సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ ని మరోసారి చూడబోతున్నాం అన్నారు.

మెట్రో రైల్ స్టేషన్లో రామ్ చరణ్ మూవీ షూటింగ్ (ఫోటోస్)

మెట్రో రైల్ స్టేషన్లో రామ్ చరణ్ మూవీ షూటింగ్ (ఫోటోస్)

అరవింద స్వామిఅరవింద్ స్వామి క్యారెక్టరైజేషన్ ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.

నటీనటులు

నటీనటులు


రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు

సాంకేతిక నిపుణులు

సాంకేతిక నిపుణులు


సినిమాటోగ్రాఫర్ - అసీమ్ మిశ్రా, మ్యూజిక్ - హిప్ హాప్ ఆది, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, కో ప్రొడ్యూసర్ - ఎన్.వి.ప్రసాద్, ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్, దర్శకుడు - సురేందర్ రెడ్డి.

English summary
RamCharan‬-Surender Reddy’s ‎Dhruva‬ movie schedule commence from May 22nd in Hyd..Kashmir schedule from June 20th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu