మరణానికి చేరువులో మైఖేల్ జాక్సన్!

ఈ జన్యుపరమైన రుగ్మత ముదిరితే ప్రాణాలకే ప్రమాదమన్నారు. మైఖేల్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, మాట్లాడే పరిస్థితిలో కూడా లేరని చెప్పారు. ఆయన ఎడమ కన్ను చూపు 95 శాతం పోయిందని తెలిపారు. ''వెంటనే వూపిరితిత్తిని మార్చాలి. అయితే ఆపరేషన్‌కు ఆయన శరీరం సహకరించడం లేదు. చాలా బలహీనంగా ఉన్నారు'' అని పేర్కొన్నారు. దీంతోపాటు ఎంఫిసెమా, పేగుల్లో రక్తస్రావంతో బాధపడుతున్నారని చెప్పారు. ''వీటి వల్ల వ్యాధి మరింత ముదిరింది. పేగుల్లో రక్తస్రావమే అన్నింటికన్నా ప్రమాదకరం. దాన్ని నిరోధించడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నా, పూర్తిస్థాయిలో విజయవంతమవలేకపోతున్నారు. ఇది జాక్సన్ ప్రాణాలు తీయవచ్చు'' అని ఇయాన్ తెలిపారు. ఎంఫిసెమా వూపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. తద్వారా రోగికి శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంది. ధూమపానం చేసేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మైఖేల్ సిగరెట్ తాగరు.
''జాక్సన్ తరహా పరిస్థితి ఐదు వేల మంది అమెరికన్లలో ఒకరికి మాత్రమే ఎదురవుతుంది. దీనికి చికిత్స చేయడం కష్టమైన పని. ఎందుకంటే అనుబంధంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి'' అని పేర్కొన్నారు. చాన్నాళ్ల నుంచి ఆయనీ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. వ్యాధి ముదరకుండా ఉండేందుకు తన వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు గతంలో పలు చికిత్సలను తీసుకున్నారని తెలిపారు. ఇయాన్ ప్రకటనపై వ్యాఖ్యానించడానికి మైఖేల్ జాక్సన్ అధికార ప్రతినిధి నిరాకరించారు. అయితే జాక్సన్ సోదరుడు జెర్మైన్ మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. ''ఆయన పరిస్థితి ఇప్పుడేం బాగోలేదు. ఇది దురదృష్టకరమైన సమయం'' అని 'ఫాక్స్ టీవీ న్యూస్'తో అన్నారు.


Click it and Unblock the Notifications











