»   » నాపాటలు ఎవరైనా పాడుకోవచ్చు, ఆత్మసంతృప్తి చాలు : మిక్కీ జె మేయర్

నాపాటలు ఎవరైనా పాడుకోవచ్చు, ఆత్మసంతృప్తి చాలు : మిక్కీ జె మేయర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో మిక్కీ జె మేయర్ కి సెపరేట్ ఇమేజ్ ఉంది. ఒక ఆల్బంలోని ప్రతీ పాటను డిఫరెంట్ గా ఇవ్వడం.. తన మాటలతో కాకుండా మ్యూజిక్ తోనే ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడం ఈ కంపోజర్ స్పెషాలిటీ. 'హ్యాపీడేస్ .. కొత్తబంగారు లోకం .. అ ఆ .. శతమానం భవతి .. సినిమాలకి మిక్కీ అందించిన సంగీతం, ఆయనకి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. పలు సూపర్ హిట్ ఆల్బమ్స్ కు సంగీతం ఇచ్చిన మిక్కీ ఖాతాలోకి.. ఇప్పుడు మరో ప్రెస్టీజియస్ చేరింది. సావిత్రి సినిమాలు చేసిన కాలం నాటి సంగీతాన్నే మిక్కీ అందించనుండటం విశేషం.

మిస్టర్‌

మిస్టర్‌

అయితే ఈ సందర్భంగా మిక్కీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, ఠాగూర్‌ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మిస్టర్‌' చిత్రానికి మిక్కీ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ

 ఆనందంగా ఉంది

ఆనందంగా ఉంది

‘‘మిస్టర్‌ పాటలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. శ్రీనువైట్లగారు నన్ను కలవగానే నాకు పెద్ద ఫ్యాన్‌ని అని చెప్పారు. ఆయన అభిరుచికి అనుగుణంగా పాటలు చేయుంచుకున్నారు. చక్కటి కమర్షియల్‌ సినిమా ఇది'' అని అన్నారు. తరువాత లేటెస్ట్ ఇళయరాజా-బాలూ టాపిక్ వచ్చింది.

అది చట్టపరమైన అంశం

అది చట్టపరమైన అంశం

సంగీత దర్శకుడు ఇళయరాజా - నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్య చోటుచేసుకున్న వివాదాన్ని గురించి ప్రస్తావించగా ‘‘అది చట్టపరమైన అంశం. నాకు ఆ రూల్స్‌ పెద్దగా తెలియవు. నాకింకా ఇండియన్ పెర్ఫార్మింగ్‌ రైట్‌ సొసైటీలో సభ్యత్వం రాలేదు. దాని మీద పెద్ద ఆసక్తి కూడా లేదు. ప్రస్తుతానికి నా ట్యూన్స్‌కి సంబంధించిన రైట్స్‌ మాత్రం నా వద్ద ఉంచుకుంటున్నాను''

ఆత్మసంతృప్తి చాలు

ఆత్మసంతృప్తి చాలు

మరి మీ విషయం లోనూ రేపు ఇదే సమస్య తలెత్తవచ్చు కదా అన్న ప్రశ్నకు సమాధానం గా ‘‘నా పాటలను ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా పాడుకోవచ్చు. గాయనీగాయకులు విదేశాల్లో కమర్షియల్‌గా పాడినప్పటికీ నాకెలాంటి అభ్యంతరం లేదు. వారు పాడటం ద్వారా అక్కడి శ్రోతలు నా పాటలను ఆస్వాదిస్తారనే ఆత్మసంతృప్తి చాలు'' అంటూ లౌక్యంగా స్పందించాడు.

వివరాలు నాకు పూర్తిగా తెలియవు

వివరాలు నాకు పూర్తిగా తెలియవు

దర్శకుల గురించి కీరవాణి చేసిన వ్యాఖ్యల విషయం లో మాత్రం చాలా జాగ్రత్తగా ఆన్సర్ చెప్పాడు మిక్కీ ‘‘ఆ వివరాలు నాకు పూర్తిగా తెలియవు. నాకు ఇప్పటిదాకా ఏ దర్శకుడితో చేదు అనుభవాలు ఎదురుకాలేదు. అందరి అభిప్రాయాలూ అన్నిసార్లూ ఒకేరకంగా ఉండాలనేం లేదు.

వాగ్వివాదాలు చేయను

వాగ్వివాదాలు చేయను

కొన్నిసార్లు అవతలివారు చెప్పింది వింటాను. మరికొన్ని సార్లు అది కరెక్ట్‌ కాదని అనిపించినప్పుడు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకుమించి వాగ్వివాదాలు చేయను'' అని అన్నారు. సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న ‘మహానటి' సినిమాకు స్వరాలు అందిస్తున్నట్టు, అలనాటి సంగీతాన్ని ప్రతిబింబించేలా ఆ గీతాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడు.

నేను నంబ‌ర్ వ‌న్ , సెకండ్ అని చూసుకోను

నేను నంబ‌ర్ వ‌న్ , సెకండ్ అని చూసుకోను

ఒక మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా నేను నంబ‌ర్ వ‌న్ , సెకండ్ అని చూసుకోను..ఆలోచించ‌ను కూడా.. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, ప్రేక్ష‌కుల‌కు నచ్చే మ్యూజిక్ ఇచ్చే మంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఉండాల‌నుకుంటాను. కొన్నిసార్లు నా పాట‌లు విన్న కొంద‌రు నా గ‌త చిత్రాల్లో పాట‌లులాగానే ఉన్నాయ‌ని అంటారు. కానీ ఓ సంగీత ద‌ర్శ‌కుడిగా వేరే ట్యూన్ ఇచ్చాన‌ని నాకు తెలుసు. రిథ‌మ్ ఒకేలా ఉండ‌టంతో విన్న‌వారికి ఒకేలా ఉన్న‌ట్లు అనుకుంటారు. అంటూ చెప్పాడు మేయర్.

English summary
Mickey, who shot to fame with 'Kottha Bangaru Lokam', is hardly media-savvy. In this rare interview days before the release of 'Mister', the talented musician takes tough questions with ease
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu