»   » డాక్టర్‌ బూతులు తిట్టాడు, అందుకే కొట్టాను: సింగర్ మికా సింగ్

డాక్టర్‌ బూతులు తిట్టాడు, అందుకే కొట్టాను: సింగర్ మికా సింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఢిల్లీ ఆప్తామాలజికల్ సొసైటి నిర్వహకులు ఢిల్లీ పుసా ఇన్సిట్యూట్ మేలా గ్రౌండ్స్ లో మూడు రోజుల పాటు జరిగిన ఓసదస్సులో ప్రముఖ గాయకుడు మీకా సింగ్ తో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం....ఈ కార్యక్రమంలో ఓ డాక్టర్ ను స్టేజీపైకి పిలిచి మరీ దాడి చేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అతనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేసారు.

అయితే ఈ దాడి ఘటనపై మికా సింగ్ ఓ స్టేట్మెంట్ విడుదల చేసారు. తాను అతనిపై ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని వివరించాడు. నా మ్యూజిక్‌ షోలో ఆ డాక్టర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళలు, చిన్న పిల్లలు తన షోను ఎంజాయ్‌ చేస్తుంటే.. సదరు డాక్టర్‌ అక్కడున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తిసుండగా సర్ది చెప్పటానికి ప్రయత్నించాను. కానీ ఆ డాక్టర్‌ వినకుండా తనకు మధ్యవేలు చూపించడంతో ఆయన్ను స్టేజ్‌ పైకి పిలిచాను, పద్ధతిగా ఉండాలని చెప్పినప్పటికీ వినకుండా బూతులు తిట్టడంతో చేయి చేసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు.

Mika Singh Defends His Stance; Releases Statement

మికా సింగ్ చేతిలో దాకి గురైన డాక్టర్ పేరు శ్రీకాంత్. అంబేద్కర్ ఆసుపత్రిలో కంటి వైద్యుడిగా పని చేస్తున్నారు. మికా సింగ్.. శ్రీకాంత్ చెంప చెల్లు మనిపించి అక్కడే ఉన్న బౌన్సర్ లకు శ్రీకాంత్ ను అప్పగించారు. బౌన్సర్ లు దాడి చెయ్యడంతో డాక్టర్ శ్రీకాంత్ కు గాయాలు అయ్యాయి. శ్రీకాంత్ ఎడమ చెవికి తీవ్రగాయాలైనాయని, అతని శరరీంలో చాల చోట్ల దెబ్బలు తగిలాయని పోలీసులు తెలిపారు.

English summary
Mika Singh slapped a doctor in South-West Delhi at the concert and was booked for wrongfully restraining the doctor, Shrikant, at the Pusa institute ground in Inderpuri, Singer Mika Singh Booked For Slapping Doctor In Delhi He has released a statement now defending his stance.
Please Wait while comments are loading...