»   » నటుడిగా క్లాసిక్ ఆటగాడు: కిక్ బాక్సింగ్ సిరీస్ లో మెరవనున్న టైసన్

నటుడిగా క్లాసిక్ ఆటగాడు: కిక్ బాక్సింగ్ సిరీస్ లో మెరవనున్న టైసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"కిక్‌ బాక్సర్‌" సిరీస్ లో వస్తున్న ఏడో మూవీ "కిక్‌ బాక్సర్‌-రెటాలియేషన్‌". ఈ సినిమాల కోసం ఎక్కువగా నిజమైన బాక్సర్లకే ప్రాధాన్యత నిస్తారీ సినిమా యూనిట్. అలాగే ఈసారి ఏడో సిరీస్ షూటింగ్ కోసం 14 మంది జాతీయ స్థాయి బాక్సర్లను ఎంపిక చేసుకున్నారు...అయితే అందులో 1వ స్థానం లో ఉన్నది మామూలు వ్యక్తి కాదు అంతర్జాతీయ స్తాయి బాక్సింగ్ లో స్టార్ హీరో అంతటి వాడు.. అతనే "మైక్ టై సన్"

ఇంతకు ముందు కూడా టైసన్‌ సినిమాల్లో కనిపించినా అవి కేవలం అతిథి పాత్రలే. ఇప్పుడు పూర్తి నిడివి ఉన్న పాత్ర చేస్తున్నాడు. "ది హ్యాంగోవర్‌", "స్క్యారీ మూవీ 5", "గ్రడ్జ్‌ మ్యాచ్‌", "ఐపీ మ్యాన్‌ 3" ఇలా కొన్ని సినిమాల్లో, మరికొన్ని టీవీ సిరీస్ లలోనూ టైసన్‌ అతిథి పాత్రలో కనిపించాడు. "హౌ ఐ మెట్‌ యువర్‌ మదర్‌" లాంటి ఇంకో రెండు మూడు టీవీ షోల్లోనూ కనిపించాడు. ఈ నిన్నటి బాక్సింగ్ చాంపియన్...

mike tyson

హాలీవుడ్‌ లో మొదటినుంచీ యాక్షన్ సినిమాలకి మంచి ఆధరణ ఉంటుంది. మార్షల్ ఆర్ట్ నేపథ్యంగా వచ్చిన అన్ని సినిమాలూ మంచి వసూళ్ళనే సంపాదించాయి. 1989లో వచ్చిన చిత్రం "కిక్‌ బాక్సింగ్‌". ఈ సినిమాలో జీన్‌ క్లాడ్‌ వాన్‌ డామీ నటించారు అప్పట్లో మంచి వసూళ్ళని సాధించటం తో ఒక దాని వెనుక ఒకటిగా ఇప్పటికి నాలుగు సీక్వెల్స్ వచ్చాయి.

అంటే మొదటి దానితో కలిపి ఐదు అయ్యాయి. "కిక్‌బాక్సర్‌ 2- ది రోడ్‌ బ్యాక్‌", "కిక్‌బాక్సర్‌ 3_ ది ఆర్ట్‌ ఆఫ్‌ వార్‌", "కిక్‌బాక్సర్‌ 4- ది అగ్రెసర్‌", "కిక్‌బాక్సర్‌ 5- ది రెడెంప్సన్‌" ఇలా వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాన్నే సాధించాయి.

మొదటి సినిమా "కిక్‌బాక్సింగ్‌"లో వాన్‌ డామీ పోషించిన కర్ట్‌ స్లేవోన్‌ పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో ఆరో సినిమాగా "కిక్‌బాక్సర్‌- వెంగియాన్స్‌" రూపొందుతోంది. 1989లో వచ్చిన "కిక్‌ బాక్సింగ్‌"కిది రీమేక్‌. తొలి "కిక్‌బాక్సింగ్‌" కథానాయకుడు వాన్‌ డామీ ఇందులోనూ నటిస్తున్నారు.

అయితే హీరో కాదు. ఆ పాత్రలో అలెన్‌ మౌసీ కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబరులో రానున్న ఈ సినిమాకి సీక్వెల్‌గా అప్పుడే ఏడో భాగం గా "కిక్‌బాక్సింగ్‌: రెటాలియేషన్‌" మొదలైపోయింది. ప్రస్తుతం కాలిఫోర్నియా, నెవడాలో షూటింగ్ జరుగుతోంది థాయిలాండ్‌ లో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రిస్తారట.

English summary
Former world champion boxer Mike Tyson has joined "Kickboxer:Retaliation," the sequel to "Kickboxer: Vengeance." "Kickboxer: Retaliation" is currently filming in California and Nevada and will head back to Thailand in June for final principal photography.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu