»   » ‘సాలా ఖదూస్’ సినిమాపై మనసుపడ్డ మైక్ టైసన్

‘సాలా ఖదూస్’ సినిమాపై మనసుపడ్డ మైక్ టైసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పటి బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ మైక్ టైసన్ ఓ బాలీవుడ్ చిత్రం ‘సాలా ఖదూస్'పై మనసు పారేసుకున్నాడు. ఈ సినిమా చూడాలని ఉందని తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించాడు. టైసన్ పోస్టుకు స్పందించిన మాధవన్, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే తన సినిమా చూపించే ఏర్పాటు చేస్తానని ట్వీట్ చేశారు.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో మాధవన్ కోచ్ గా నటించిన సంగతి తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే బాలీవుడ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు అందాయి.

I'd like to see this boxing film

Posted by Mike Tyson on Monday, February 1, 2016

సినిమా కథ విషయానికొస్తే...
ఆది తోమర్(మాధవన్) మంచి టాలెంట్ ఉన్న బాక్సింగ్ క్రీడాకారుడు. తన కోచ్ దేవ్ ఖత్రి మరియు ఇతరుల కుట్రతో భారత్ కు బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకురావాలనే లక్ష్యం చేజారిపోతుంది. దాంతో నిరాశకి లోనైనా ఆది భారత మహిళ బాక్సింగ్ జట్టుకు కోచ్ గా వెళ్తాడు. అక్కడ కూడా రాజకీయ కారణంతో బదిలీ అయి చెన్నైకి వెళ్తాడు. ఇక తాను సాధించలేకపోయిన గోల్డ్ మెడల్ ని తన శిష్యురాలు అయిన సాధించాలనే కసితో అందుకు తగిన అమ్మాయిని వెతుకుతున్న సమయంలో చేపలు పట్టే కుటుంబానికి చెందిన మది(రితిక సింగ్) ని చూస్తాడు. ఆమె టాలెంట్ ని గ్రహించిన ఆది తన శిష్యురాలిగా మదిని చేసుకొని శిక్షణ ఇస్తుంటాడు.

ఇక కోచింగ్ ఇస్తున్నందుకు రోజుకు 500 రూపాయలు ఇచ్చేలా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. అదే సమయంలో ఎలాగైనా పోలీస్ ఉద్యోగం సంపాదించాలని మది అక్క లక్ష్మి(ముంతాజ్ సర్కార్) బాక్సింగ్ సాధన చేస్తుంటుంది. అయితే తన చెల్లెలు మది పట్ల ఆది చూపిస్తున్న ప్రేమని తట్టుకోలేక కోపంతో ఒక ముఖ్యమైన మ్యాచ్ లో మదిని పాల్గొనకుండా చేస్తుంది. ఇదంతా తెలుసుకున్న ఆది అప్పటికి మది తన అక్కకి సపోర్ట్ చేస్తుండటంతో మదిపై మండిపడుతాడు. ఆ తర్వాత మదికి కోచింగ్ ఇవ్వనని బయటికి పంపిస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో మది జైలుపాలు అవుతుంది. ప్రపంచ స్థాయిలో బాక్సింగ్ లో గెలిచి భారత్ కి స్వర్ణం తీసుకురావాలనుకున్న మది జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటి ? తన కోచ్ ఆది ఆమెపై పెట్టుకున్న లక్ష్యాన్ని మది సాధించిందా? అనేది ఆసక్తికరంగా చూపించారు.

English summary
Legendary boxer Mike Tyson took to Facebook to share his desire to watch the “boxing film” ‘Saala Khadoos’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu