వీడు మామూలోడు కాదు: 23 ఏళ్ల అమ్మాయితో 52 ఏళ్ల నటుడి వివాహం?

By Bojja Kumar

Recommended Video

వీడు మామూలోడు కాదు.. 23 ఏళ్ల అమ్మాయితో 52 ఏళ్ల నటుడి వివాహం?

ఆడ, మగ మధ్య ప్రేమ వ్యవహారాల్లాంటివి సహజమే. అది మానవ నైజం. కానీ కొందరి సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వయసు పరంగా అయినా, ఈడుజోడు పరంగా చూసినా అస్సలు మ్యాచింగ్ అనిపించదు. అందుకు బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ ప్రేమ వ్యవహారం చక్కటి ఉదాహరణ. మంచి వయసులో ఉన్నపుడే చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలను ప్రేమలో పడేయటానికి నానా తంటాలు పడుతుంటారు. అలాంటిది ముదిరిపోయి ముసలత్వానికి దగ్గరగా ఉన్న ఓ వ్యక్తి మిసమిసలాడే ట్వంటీస్ అమ్మాయిని ప్రేమలోకి దింపడం అంటే మామూలు విషయం కాదు.

ఆమె వయసు 23, ఈయన వయసు 52

ఆమె వయసు 23, ఈయన వయసు 52

52 ఏళ్ళ వయసున్న మిలింద్ సోమన్.... 23 ఏళ్ల వయసున్న అంకిత కోన్వర్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతూ, ఆమెతో సహజీవనం చేస్తూ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. త్వరలో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 అంకిత కుటుంబం పెళ్లికి గ్రీన్ సిగ్నల్

అంకిత కుటుంబం పెళ్లికి గ్రీన్ సిగ్నల్

బాలీవుడ్ మీడియాలో మిలింద్, అంకిత జంట మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఈ ఇద్దరి వివాహానికి అంకిత కుటుంబం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2018లో వీరి వివాహం జరుగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 మిలింద్ వారికి కూడా నచ్చేశాడు

మిలింద్ వారికి కూడా నచ్చేశాడు

మిలింద్ ఇటీవల తన ప్రియురాలితో కలిసి ఆమె స్వస్థలం గౌహతి వెళ్లారు. అక్కడ జరిగిన ఓ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అంకిత కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కలిశారు. ఈ క్రమంలోనే పెళ్లి ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది.

 ఏజ్ గ్యాప్ విషయంలో అభ్యంతరం లేదా?

ఏజ్ గ్యాప్ విషయంలో అభ్యంతరం లేదా?

మిలింద్, అంకిత ప్రేమ వ్యవహారం... వీరి మధ్య ఉండే ఏజ్ గ్యాప్ గురించి కుటుంబ సభ్యులకు మొదటి నుండి కొన్ని అభ్యంతరాలు ఉండేవట. అయితే ఇటీవల అతడు స్వయంగా వచ్చి కలిసిన తర్వాత అతడి వ్యక్తిత్వం, మంచితనం చూసి వాళ్లు కూడా అతడినే తమ ఇంటి అల్లుడిని చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నారట.

వయసు పైబడినా... విషయం ఉన్నోడే!

వయసు పైబడినా... విషయం ఉన్నోడే!

మిలింద్ సోమన్ వయసు ఎక్కువే అయినా... విషయం ఉన్నోడే. అటు ఫిట్ నెస్ పరంగా ఆయన ది బెస్ట్ అని నిరూపించుకున్నాడు. బాలీవుడ్ పాపులర్ స్టార్లలో ఒకరైన మిలింద్ సంపాదన పరంగా కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు.

 అందుకే ఆమె అంటే అతడికి ఎంతో ఇష్టం

అందుకే ఆమె అంటే అతడికి ఎంతో ఇష్టం

తన గర్ల్ ఫ్రెండ్ గురించి మిలింద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... నేను ఈ రోజు ఒక ప్లేసులో ఉంటాను, రేపు మరో ప్లేసులో ఉంటాను. ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. నా జీవితాన్ని ఆమె బాగా అర్థం చేసుకుంది, నన్ను ఇష్టపడుతోంది అని తెలిపారు.

 ఇప్పటికే ఓ వివాహం చేసుకున్న మిలింద్

ఇప్పటికే ఓ వివాహం చేసుకున్న మిలింద్

మిలింద్ సోమన్ 2006లో మైలీనే జంపానోయ్ అనే ఫ్రాన్స్ నటిని పెళ్లాడారు. అయితే 2009లో వీరు విడిపోయారు. ఆ తర్వాత అతడు పెళ్లి చేసుకోలేదు. తాను మంచి భర్తగా ఉండలేను. నా జీవితానికి ఒక ప్యాటర్న్ అంటూ ఉండదు. అయితే నేను ఒక గ్రేట్ బాయ్ ఫ్రెండుగా మాత్రం ఉండగలను అని మిలింద్ సోమన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి అలాంటి వ్యక్తి మళ్లీ ఇపుడు రెండో పెళ్లికి సిద్దమవ్వడం గమనార్హం.

 అంకిత కంటే ముందు ఆ మోడల్‌తో

అంకిత కంటే ముందు ఆ మోడల్‌తో

అకింత కోన్వర్ కంటే ముందు సూపర్ మోడల్ మధు సప్రేతో మిలింద్ సోమన్ ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరు ఇద్దరూ అప్పట్లో ట‌ఫ్ షూస్ అనే ప్రకటనలో నగ్నంగా నటించడం వివాదాస్పదం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X