»   » రసికుడే: ఆయన వయసేంటి, ఆవిడ వయసేంటి, ఈ ఎఫైరేంటి? (ఫోటోస్)

రసికుడే: ఆయన వయసేంటి, ఆవిడ వయసేంటి, ఈ ఎఫైరేంటి? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆడ, మగ మధ్య ప్రేమ వ్యవహారాల్లాంటివి సహజమే. అది మానవ నైజం. కానీ కొందరి సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వయసు పరంగా అయినా, ఈడుజోడు పరంగా చూసి అస్సలు మ్యాచింగ్ అనిపించదు.

అందుకు బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ చక్కటి ఉదాహరణ. మిలింద్ సోమన్ ప్రేమ వ్యవహారం ఇపుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. 50ల్లో ఉన్న మిలింద్... 20ల్లో ఉన్న అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ ఇద్దరి రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

వీడు మామూలోడు కాదు...

వీడు మామూలోడు కాదు...

మంచి వయసులో ఉన్నపుడే చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలను ప్రేమలో పడేయటానికి నానా తంటాలు పడుతుంటారు. అలాంటిది ముదిరిపోయి ముసలత్వానికి దగ్గరగా ఉన్న ఓ వ్యక్తి మిసమిసలాడే ట్వంటీస్ అమ్మాయిని ప్రేమలోకి దింపడం అంటే మామూలు విషయం కాదు.

మిలింద్ ప్రేమలో పడ్డ అమ్మాయి ఈవిడే..

మిలింద్ ప్రేమలో పడ్డ అమ్మాయి ఈవిడే..

మిలింద్ సోమన్ ప్రేమలో పడ్డ ఆ ట్వీంటీస్ అమ్మాయి పేరు అంకిత కోన్వర్. ఇద్దరూ కలిసి కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు.

ఏం చూసి ప్రేమించిందో..

ఏం చూసి ప్రేమించిందో..

లుక్ పరంగా... చూడ్డానికి మిలింద్ తన వయసు కంటే చాలా ఓల్డ్‌గా కనిపిస్తాడు. మరి అలాంటి మిలింద్‌లో మిలమిల మెరిసే క్వాలిటీస్ ఏం కనిపించాయో తెలియదు కానీ ఈ అంకిత కోన్వర్ అతడి ప్రేమకు అంకితం అయిపోయిందని బాలీవుడ్లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

మా ఇష్టం, మీకేంటి?

మా ఇష్టం, మీకేంటి?

సాధారంగా ఇలాంటి జోడిని చూసిన ఎవరైనా...... మీరు అస్సలు మ్యాచింగ్‌గా లేరు అనే అర్థం వచ్చేలా లుక్ పెట్టి అదోలా చూస్తారు... అలా చూసిన వారికి మా లవ్, మా ఇష్టం వచ్చినట్లు ఉంటామని సమాధానం ఇస్తోంది ప్రేమజంట.

నేను మంచి భర్తను కాదు

నేను మంచి భర్తను కాదు

మిలింద్ సోమన్ 2006లో మైలేనే జంపానోయ్ అనే ఫ్రాన్స్ నటిని పెళ్లాడారు. అయితే 2009లో వీరు విడిపోయారు. ఆ తర్వాత అతడు పెళ్లి చేసుకోలేదు. తాను మంచి భర్తగా ఉండలేను. నా జీవితానికి ఒక ప్యాటర్న్ అంటూ ఉండదు. అయితే నేను ఒక గ్రేట్ బాయ్ ఫ్రెండుగా మాత్రం ఉండగలను అని మిలింద్ సోమన్ తెలిపారు.

రిలేషన్ షిప్ గురించి మిలింద్

రిలేషన్ షిప్ గురించి మిలింద్

50 ఏళ్ల వయసులో ఈ రిలేషన్స్ ఏమిటి అని ప్రశ్నిస్తే... ఈ వయసులో మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అపుడే నీ పార్ట్‌నర్‌ను యాక్సెప్ట్ చేసి అర్థం చేసుకోగలవు అని తెలివిగా మాట్లాడుతున్నాడు.

నన్ను ఆమె అర్థం చేసుకుంది

నన్ను ఆమె అర్థం చేసుకుంది

తన గర్ల్ ఫ్రెండ్ గురించి మిలింద్ మాట్లాడుతూ.... నేను ఈ రోజు ఒక ప్లేసులో ఉంటాను, రేపు మరో ప్లేసులో ఉంటాను. ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. నా జీవితాన్ని ఆమె బాగా అర్థం చేసుకుంది, నన్ను ఇష్టపడుతోంది అని తెలిపారు.

English summary
Remember the guy you had a huge crush on when you were in your teens? Yes, we are talking about the same man, who featured in Alisha Chinoy's 'Made in India' song and left all swooning over and over! Well, we have a bad news. He's no more single! Yes, you read it right, Milind Soman has found love once again and is apparently dating a girl half his age and their pictures will surely not make you happy. So, do look at their pictures at your own risk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu