»   » పవన్‌ తొ సినిమా తీస్తా: మంత్రి బొత్సా

పవన్‌ తొ సినిమా తీస్తా: మంత్రి బొత్సా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్‌ హీరోగా త్వరలో తాను చిత్రాన్ని నిర్మిస్తున్నానని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రకటించారు. సినిమా పేరును ఇంకా ఖరారు చేయలేదనీ, అయితే వీలైనంత త్వరలో తాను నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ ప్రారంభిస్తానని మంత్రి అసెంబ్లి లాబీలోతో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ తో సినిమా నిర్మించాలన్నది ఎప్పటినుంచో అనుకున్నాననీ, అయితే రాజకీయాల్లో అలుపెరగకుండా ఉండడంతో ఈ ప్రతిపాదన వాయిదా వేసుకుంటూ వచ్చాననీ, వీలైనంత త్వరగా ఈ సినిమాను ప్రారంభించి వెండితెరపై చూపించాలన్నదే తన స్వప్నమని మంత్రి తెలిపారు. ఈ నెల 29న అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మంత్రి బొత్సా తన నివాసంలో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ విందుకు రావలసిందిగా మంత్రి ప్రరాపా అధినేత చిరంజీవిని కలిసి అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కొంచెం సేపు మాట్లాడుకున్నారు. ఇక నిర్మాతగా మారిన హాస్య నటుడు గణేష్ వెనక బొత్సా సత్యనారాయణ ఉన్నట్లు చాలా కాలంగా వినపడుతుందే. గణేష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా లవ్ ఆజ్ కల్ చిత్రాన్ని జయంత్ పరాంన్జీ దర్శకత్వంలో చేస్తున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu