»   » శృతిహాసన్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు : మంత్రి కామినేని

శృతిహాసన్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు : మంత్రి కామినేని

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినీనటి శృతిహాసన్‌ను తాను సినిమాల్లో తప్ప ఏనాడూ చూడలేదని, అసభ్యంగా ప్రవర్తించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని రాష్ట్ర మంత్రి కామినేని సవాలు చేశారు. తాను శృతిహాసన్‌తో అసభ్యంగా ప్రవర్తించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తాను ఆమె గురించి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెప్పారు. తాను ఇటీవల విమానంలో కూడా ప్రయాణించ లేదని మంత్రి కామినేని స్పష్టం చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శృతిహాసన్... కెరీర్ విషయానికి వస్తే...

ప్రస్తుతం శృతి హాసన్... మహేష్ బాబు తాజా చిత్రం శ్రీమంతుడులో చేస్తోంది. అలాగే విజయ్ సరసన ఆమె పులి చిత్రం చేస్తోంది. అంతేకాకుండా అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న గబ్బర్ చిత్రం(ఠాగూర్ రీమేక్)లోనూ ఆమె హీరోయిన్ గా చేసి ,ప్రస్తుతం ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఇలా వరసగా బిజిగ ఉన్న ఆమె కార్తి,నాగార్జున ప్రాజెక్టులో కొనసాగుతుందో లేదో చూడాలి.

Minister Kamineni Srinivas Condemns Shruti Hassan abuse

శృతి హాసన్ మాట్లాడుతూ...''ఎవరు ఎన్ననుకొన్నా, ఏం చేసినా విజయం కోసమే. విజయానికి మించిన కిక్‌ ఏదీ ఇవ్వదు. హిట్‌ అనే పదం ఎందరి తలరాతలో మార్చేస్తుంది. అలాంటి విజయం ఎప్పుడు దొరికినా అపురూపమే..'' అంటోంది శ్రుతి హాసన్‌. 'గబ్బర్‌సింగ్‌' తరవాత శ్రుతి కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. వరుస విజయాలతో టాప్‌గేర్‌లోకి వచ్చేసింది.

''హిట్‌ అనేది జాతకాల్ని పూర్తిగా మార్చేస్తుంది. స్టార్లు పుట్టుకొచ్చేస్తారు. ప్రతిభకు విజయం తోడైతే ఇక చెప్పనవసరం లేదు. అలాగని విజయం సాధించిన వాళ్లంతా ప్రతిభావంతులు కాకపోవచ్చు. వాళ్లను విజయలక్ష్మి ఎంత కాలం అంటిపెట్టుకొని ఉంటుందో చెప్పలేం. కానీ ప్రతిభ ఉంటే.. ఎప్పటికైనా విజయం సాధించొచ్చు. కాస్త ఆలస్యమైనా.. ఆ విజయం శాశ్వతం. నా కెరీర్‌లో విజయాలు లేవని ఎప్పుడూ బాధపడలేదు. నేను నమ్ముకొంది ప్రతిభనే. అదే విజయానికి దారి చూపిస్తుందన్న నమ్మకం నాకెప్పుడూ ఉంటుంది'' అంది.

English summary
Never seen Shruti hassan minister kamineni Clarifies. Minister Kamineni Srinivas Condemns Shruti Hassan abuse.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu