For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'దేనికైనా రెడీ' వివాదంపై మంత్రి శ్రీధరబాబు హామీ

  By Srikanya
  |

  హైదరాబాద్ : 'బంతి కోర్టులో ఉంది. కమిటీని నియమించడం సబబేనని రుజువు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుంది' అని మంత్రి అన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే సినిమాల విషయంలో తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించడంలో సెన్సార్ బోర్డు సభ్యులు విఫలమైనందున.. వారందరినీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సిఫార్సు చేస్తూ లేఖలు రాశారని పౌరసరఫరాల మంత్రి శ్రీ్ధర్‌బాబు వెల్లడించారు. బ్రాహ్మణుల మనోభావాలను కించపరుస్తూ మోహన్‌బాబు నిర్మించిన 'దేనికైనా రెడీ' చిత్రంపై సర్కార్ కమిటీ వేయడం సబబేనని, ఆ విషయాన్ని న్యాయపరంగానే తేలుస్తామన్నారు. వరంగల్ మహేశ్వరి గార్డెన్స్‌లో నిర్వహించిన బ్రాహ్మణ శంఖారావం సదస్సుకు శ్రీధర్‌బాబు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

  మోహన్‌బాబు పతనం మొదలైందని లక్ష్మీపార్వతి అన్నారు. బ్రాహ్మణుల మనోభావాలను తన చిత్రంలో కించపరచడమే కాకుండా వారిని చులకన చేసిన రోజునుంచే మోహన్‌బాబు పతనం ప్రారంభమైందని నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. 'నా ద్వారా ఎన్టీఆర్‌కు చెప్పించి రాజ్యసభ పదవి ఇప్పించుకుని తరువాత నన్నే తిట్టిన సంస్కారహీనుని పేరు కూడా ఉచ్ఛరించేదిలేదు' అని ఆగ్రహంతో అన్నారు. బ్రాహ్మణ జాతిని అవమానించడం అంటే తల్లిని అవమానించిన ఆమె అన్నా రు. రాక్షస మానస్తత్వం కలిగినవాడు మోహన్‌బాబు అని ఆమె మండిపడ్డారు.

  సినీగేయరచయిత జొన్నవిత్తుల రామలింగశాస్త్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బ్రాహ్మణులు ఐక్యం గా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పెద్దరాయుడు చిత్రంలో అన్నివర్గాలకు సమానంగా గౌరవమివ్వాలని చెప్పిన మోహన్‌బాబు తాను మాత్రం బ్రాహ్మణిజాన్ని కించపరిచడం తగదన్నారు. మోహన్‌బాబుకు ఇదివరకు ప్రదానం చేసిన పద్మశ్రీ బిరుదును కేంద్ర ప్రభుత్వం రద్దుచేయాలని సినీ గేయ రచయిత జొన్నవిత్తుల డిమాండ్ చేశారు. బ్రాహ్మణులను కించపరచిన సంస్కృతి ద్రోహునికి పద్మశ్రీ అవార్డు సముచితం కాదని వ్యాఖ్యానించారు. 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే సన్నివేశాలు ఉంటే గంటలోపే వాటిని తీసివేసేలా చేసిన సత్తా తెలంగాణ ప్రజలదని ఆయన అన్నారు. అదే స్ఫూర్తితో దేనికైనా రెడీ సినిమాను రద్దుచేసే వరకు బ్రా హ్మణులు పోరాడాలని అన్నారు.

  ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ... 40ఏళ్లుగా బ్రాహ్మణులను కించపరుస్తూ సినిమాలు వస్తూనే ఉన్నాయి. చిత్ర పరిక్షిశమ బ్రాహ్మణ సమాజాన్ని అవమాన పరుస్తూనే ఉంది. ఇతరులను అవహేళన చేస్తూ డబ్బు సంపాదించడం సరియైంది కాదు. బ్రాహ్మణులు చేస్తున్న పోరాటం వ్యక్తులకు వ్యతిరేకం కాదు అని మద్దతు పలికారు.

  నందమూరి లక్ష్మీపార్వతి, సినీ గేయరచయిత జొన్నవిత్తుల, ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, దిలీప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తదితరులు సదస్సుకు హాజరై బ్రాహ్మణులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలోని చిత్తూరు, విజయవాడతోపాటు తెలంగాణ పది జిల్లాల నుంచి వచ్చిన సుమారు వేయిమంది బ్రాహ్మణులు హాజరయ్యారు. వేదమూర్తులైన బ్రాహ్మణులను మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణుతో సహా ఎంతటి వారు కించపరచినా ఊరుకోబోమని.. అన్నివర్గాలను కలుపుకుని ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని వరంగల్ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. హిందుధర్మాన్ని, బ్రాహ్మణ జాతి అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలను ఎండగడతామని హెచ్చరించింది. దేనికైనా రెడీ, ఉమెన్ బ్రాహ్మణిజం చిత్రాల దర్శక, నిర్మాతలను సంఘ బహిష్కరణ చేయాలని, సెన్సార్ బోర్డు సభ్యులుగా రాజకీయ పార్టీల కార్యకర్తలకు ఆశ్రయం కల్పించే చర్యలకు ప్రభుత్వం స్వస్తి పలకాలని కోరుతూ మొత్తం 14 తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

  English summary
  Minister Duddilla Sridhar Babu took objection to the clearing of the controversial film ‘Denikaina Ready’ by the Central Board of Film Censors as it demeaned a community in the film. He said that the producers objecting to a Government committee to review the controversial film and recommend cuts for implementation was nullified by the stay order of the court as the producer of the film approached the honourable court without respecting sentiments of the community.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X