»   » మంచు విష్ణుకు ప్రమాదం, ఆరోగ్య పరిస్థితిపై మోహన్ బాబు ట్వీట్

మంచు విష్ణుకు ప్రమాదం, ఆరోగ్య పరిస్థితిపై మోహన్ బాబు ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఆచారి అమెరికా యాత్ర' షూటింగులో భాగంగా మలేషియా వెళ్లిన హీరో మంచు విష్ణు తీవ్ర గాయాలపాలయ్యారు. విష్ణు రైడ్ చేస్తున్న బైక్ స్కిడ్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం మంచు విష్ణు ఐసీయూలో ఉన్నట్లు సమాచారం. అమెరికాలో షూటింగుపూర్తి చేసుకున్న అనంతరం ఇటీవల మలేషియాలో చిత్రీకరణ మొదలైంది. మంచు విష్ణు గాయాలపాలవ్వడంతో షూటింగుకు బ్రేక్ పడింది.

ఎలా జరిగింది?

ఎలా జరిగింది?

ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొట్టడంతో మంచు విష్ణు బైక్ పై నుంచి కిందపడిపోయాడు. దీంతో విష్ణు మెడ, భుజానికి తీవ్రగాయాలు అయినట్టు సమాచారం.

Manchu Vishnu Enjoying His Brother's Song : Watch
పరిస్థితి క్రిటికల్

పరిస్థితి క్రిటికల్

వివిధ పరీక్షలు నిర్వహించి భుజం ఎముక ఫ్రాక్చర్ అయిందని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను మరొక ఆసుపత్రికి మార్చనున్నారు. పరిస్థితి కాస్త క్రిటికల్‌గానే ఉన్నట్లు సమాచారం.

ఫ్యాన్స్ కంగారు పడొద్దు

ఫ్యాన్స్ కంగారు పడొద్దు

అయితే అభిమానులు కంగారుపడాల్సిన అవసరం లేదని, విష్ణు సేఫ్ గా ఉన్నాడని మోహన్ బాబు, మనోజ్, మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.

ఆచారి అమెరికా యాత్ర

ఆచారి అమెరికా యాత్ర

మంచు విష్ణు-బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచారి అమెరికా యాత్ర". "దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం" లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు-జి.నాగేశ్వర్రెడ్డిల కాంబిణేషన్ లో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

మంచు విష్ణు

మంచు విష్ణు

ఈ చిత్రానికి కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, కళ: కిరణ్, ఫైట్స్: వెంకట్, డ్యాన్స్: ప్రేమ్ రక్షిత్-దినేష్-గణేష్, కాస్ట్యూమ్స్: నరసింహ, లిరిక్స్: భాస్కరభట్ల, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణ ప్రసాద్, స్టిల్స్: రాజు, మాటలు: డార్లింగ్ స్వామి, స్క్రీన్ ప్లే: విక్రమ్ రాజ్-నివాస్-వర్మ, సంగీతం: శేఖర్ చంద్ర, ఛాయాగ్రహణం: సిద్దార్థ, నిర్మాతలు: కీర్తి చౌదరి-కిట్టు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వర్రెడ్డి!

English summary
Manchu vishnu injured at movie shooting in Malaysia. Manchu vishnu is currently busy with the shooting of “Achari America Yatra” at Malaysia.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu