»   » సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎల్లోఫ్లవర్స్ ద్వితీయ చిత్రం

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎల్లోఫ్లవర్స్ ద్వితీయ చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

'కిక్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో 'మిరపకాయ్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ లో 'కిక్' సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రమేష్ పుప్పాల తమ ద్వితీయ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు.

ఈ చిత్రం గురుంచి నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ 'మా బ్యానర్ లో వచ్చిన తోలిచిత్రం మిరపకాయ్ 114 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవ౦ జరుపుకునేలా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అతి త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మా ద్వితీయ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాం. సురేందర్ రెడ్డి చెప్పిన స్టొరీ లైన్ చాలా బాగుంది. ప్రముఖ యువ హీరో ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తారు' అన్నారు.

సహా నిర్మాత వి.సురేష్ రెడ్డి మాట్లాడుతూ 'కిక్' లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన మా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో సురేందర్ రెడ్డి తో ఈ చిత్రం చెయ్యడం హ్యాపీ గా వుంది. భారీ తారాగణంతో, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రం రూపొందుతుంది' అన్నారు.

English summary
Yellow Flowers banner that made successful Mirapakay movie with Ravi Teja in the lead has roped in star director Surender Reddy to direct their next film. Ramesh Puppala is the producer of this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu