twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మిర్చి’ 100 డేస్ సెంటర్స్...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి' చిత్రం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. ఈ నెల 18తో మొత్తం 28 సెంటర్లలో ఈ చిత్రం వంద రోజుల పండగ జరుపుకోబోతోంది. మిర్చి చిత్రం ప్రభాస్ కెరీర్లోని విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

    ఏ ఏరియలో ఎన్సి సెంటర్లలలో ప్రదర్శితం అయిందనే వివరాలు పరిశీలిద్దాం.

    నైజాం : 03 సెంటర్లు
    సీడెడ్ : 07 సెంటర్లు
    వైజాగ్ : 02 సెంటర్లు
    వెస్ట్ : 03 సెంటర్లు
    ఈస్ట్ : 04 సెంటర్లు
    కృష్ణ : 03 సెంటర్లు
    గుంటూరు : 06 సెంటర్లు

    ఇప్పటికే ఈ చిత్రం 238 సెంటర్లలో గ్రాండ్ గా 50 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికాలో 50 రోజులు ఆడిచిన చిత్రంగా కూడా రికార్డులకెక్కింది. 'మిర్చి' చిత్రం ద్వారా కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా చేయగా, యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని నిర్మించారు.

    సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.

    English summary
    Prabhas’s Mirchi ran successfully 100 days AP in 28 centers. The film ran for 50 days successfully in two centers in USA. This is the first time any telugu movie has achieved this feat in USA.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X