»   » బాలకృష్ణ చూసారు...ఆయనకు నచ్చింది

బాలకృష్ణ చూసారు...ఆయనకు నచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''లయన్‌' తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న చిత్రం 'మిర్చి లాంటి కుర్రాడు'. మా హీరో బాలకృష్ణగారికి సినిమాని ప్రత్యేకంగా చూపించాం. ఆయనకి చాలా బాగా నచ్చింది'' అన్నారు నిర్మాత రుద్రపాటి రమణారావు. ఆయన 'లయన్‌' చిత్రం నిర్మాత. ఆయన తన తదుపరి చిత్రంగా 'మిర్చి లాంటి కుర్రాడు'చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజిత్‌, ప్రగ్యా జైశ్వాల్‌ జంటగా నటించిన చిత్రం 'మిర్చి లాంటి కుర్రాడు'. జయనాగ్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


నిర్మాత రుద్రపాటి రమణారావు మాట్లాడుతూ... ''మిర్చి అంతటి పొగరున్న ఓ కుర్రాడు ప్రేమ విషయంలో చూపిన తెగువే ఈ చిత్రం. పేరుకు తగ్గ హీరోయిజంతో పాటు సరదా సన్నివేశాలు కూడా బోలెడన్ని ఉన్నాయి. సినిమాకి జె.బి. సంగీతం ప్రధాన బలం. నాలుగు పాటలున్నాయి. హాస్యం ఆకట్టుకుంటుంది. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుందనే నమ్మకం నాకుంది''అన్నారు.


'Mirchi lanti Kurradu' grand release on July 31

డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ''చక్కటి లవ్ స్టోరీ. యాక్షన్ నేపధ్యం ఉన్న కథకు వినోదం, లవ్ జోడించాము. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. వీరబాబు డైలాగ్స్, జెబి మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ అవుతాయి'' అని అన్నారు.


హీరో అభిజిత్ మాట్లాడుతూ ''చాలా పవర్ ఫుల్ టైటిల్ ఇది. టైటిల్ బట్టి ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటన్ టైనర్ అనుకునే అవకాశం ఉంది. కానీ కథకు ఎంత అవసరమో అంతే యాక్షన్ ఈ సినిమాలో ఉంటుంది. లవ్, సెంటిమెంట్, కామెడీ అన్నీ ఈ చిత్రానికి చక్కగా కుదిరాయి అన్నారు.


ఈ చిత్రంలో రావు రమేష్, నాగినీడు, సప్తగిరి, సుప్రిత్, రజిత, ప్రభాస్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం - జె.బి, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, కెమెరా - ఆర్.ఎం.స్వామి, మాటలు - వీరబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రాజు.

English summary
Abhijeeth and Pragya Jaiswal starrer ‘Mirchi lanti Kurradu’ is releasing grandly worldwide on July 31. Renowned producer Rudrapati Ramanarao is producing the film under SLV Cinema banner with Rudrapati Hemalatha as presenter. Jayanag was introduced as director, JB has provided music. The film has completed the shooting part and presently post-production works are in progress. The film unit is planning to release the film in the third week of December.
Please Wait while comments are loading...