»   »  అనిల్ కపూర్ కొడుకు తెరంగ్రేటం మామూలుగా లేదుగా... (మరో వీడియో)

అనిల్ కపూర్ కొడుకు తెరంగ్రేటం మామూలుగా లేదుగా... (మరో వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్లో మరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ వారసత్వంతో ఇప్పటికే ఆయన కూతురు సోనమ్ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్దన్ కపూర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

'మీర్జ్యా' అనే సినిమా ద్వారా హీరోగా తెరంగ్రేటం చేస్తున్నాడు హర్ష వర్ధన్. పంజాబీ వీరుడు మీర్జా సాహిబన్ ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రంగ్ దే బసంతి, ఢిల్లీ 6, భాగ్ మిల్ఖా భాగ్ లాంటి గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

MIRZYA Title Song

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ సాంగ్ వీడియో విడుదల చేసారు. టైటిల్ సాంగ్ అదిరిపోంది. ట్రైలర్, సాంగ్ చూసిన తర్వాత ఈ సినిమా బాలీవుడ్లో మరో బ్లాక్ బస్టర్ కావడం ఖాయం అంటున్నారంతా.

ఈ సినిమాకు గుల్జార్ కథను అందించారు. ఈ చిత్రంలో తెలుగులో రేయ్ చిత్రంలో నటించిన సయామీ ఖేర్ హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా సినిమాలకు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమాకుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఓంపురి, ఆర్ట్ మాలిక్, కెకె రైనా, అనుజ్ చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భాగ్ మిల్ఖా భాగ్ చిత్రానికి సంగీతం అందించిన సంగీత త్రయం శంకర్, ఎస్సాన్, లాయ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ 7న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాకేష్ ఓం ప్రకాస్ మెహ్రా సినిమాలు విభిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో 'మీర్జ్యా' చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

English summary
MIRZYA Title Song from the upcoming Bollywood film MIRZYA ,Starring Harshvardhan Kapoor, Saiyami Kher, Anuj Chaudhary. This Movie is Inspired by the folk tale of the legend of Mirza – Sahiban, MIRZYA is an epic action-romance set in contemporary times. The film unfolds filled with heightened drama & action packed sequences in the visually rich terrain of Rajasthan, contrasted with flashes of the fantastical universe of the folklore set in the awe-inspiring landscape of Ladakh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu