»   » సెక్స్ అడిక్ట్ కాన్సెప్ట్: ‘అవసరాల’కు హీరోయిన్ బుక్ అయింది!

సెక్స్ అడిక్ట్ కాన్సెప్ట్: ‘అవసరాల’కు హీరోయిన్ బుక్ అయింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్య హిందీలో 'హంటర్' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఈ సినిమాలో అవసరాల హీరో పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో హీరో పాత్ర సెక్స్‌కు అడిక్ట్ నేపథ్యంతో సాగుతుంది.

సినిమా కథ ప్రకారం ముగ్గురు హీరోయిన్లు ఉంటాయి. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా రెజీనాను, రెండో హీరోయిన్ గా నటి శ్రీముఖిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో మూడో హీరోయిన్ కూడా బుక్ అయినట్లు తెలుస్తోంది.

నితిన్ హీరోగా తెరకెక్కిన 'చిన్నదాన నీకోసం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మిష్టీ చక్రవర్తి అవసరాల శ్రీనివాస్ సరసన మూడో హీరోయిన్ గా కనిపించబోతోందని తెలుస్తోంది.

చిన్నదాన నీకోసం సినిమాలో మిష్టీ చక్రవర్తి అందం పరంగా, పెర్పార్మెన్స్ పరంగా ఆకట్టుకుంది. అయితే ఎందుకనో ఆమెకు ఆ సినిమా పెద్దగా బ్రేక్ ఇవ్వలేదు, ఆ తర్వాత కొలంబర్ అనే మరో తెలుగు సినిమాలో అవకాశం వచ్చినా అది పెద్దగా ఆడలేదు.

తెలుగులో సాంప్రదాయ బద్దంగా కనిపించిన మిష్టీ చక్రవర్తి.... బాలీవుడ్లో అడల్ట మూవీలో అవకాశం రావడంతో అటువైపు అడుగులు వేసింది. ఈ ఏడాది మొదట్లో రిలీజైన సెక్స్ కామెడీ మూవీ 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' చిత్రంలో నటించింది. ఈ సినిమాలో ఆమె చాలా హాట్ అండ్ సెక్సీగా నటించింది.

ఇందులో హాట్ పాత్రే..

ఇందులో హాట్ పాత్రే..

హంటర్ తెలుగు రీమేక్‌లో హాట్ అండ్ సెక్సీ రోల్ ఉండటంతో... దర్శక నిర్మాతల దృష్టి మిష్టీ చక్రవర్తిపై పడింది. గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాలో మాదిరిగానే హంటర్ తెలుగు రీమేక్ లో కూడా ఆమె హాట్ పాత్రలో కనిపించబోతోంది.

పాత్రలో హాట్ యాటిట్యూడ్

పాత్రలో హాట్ యాటిట్యూడ్

తెలుగు రీమేక్ లో హాట్ యాటిట్యూడ్ ఉన్న పాత్రలో మిష్టి చక్రవర్తి కనిపించబోతోంది.

గ్లామర్ డోసు

గ్లామర్ డోసు

ఆమె గత తెలుగు సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగానే ఉండబోతోంది.

అవసరాల శ్రీనివాస్

అవసరాల శ్రీనివాస్

'అష్టాచమ్మా' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటుడు అవసరాల శ్రీనివాస్. తర్వాత 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర చేయడం ద్వారా అటు నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

అటు దర్శకుడిగా సినిమాలు చేస్తూ...

అటు దర్శకుడిగా సినిమాలు చేస్తూ...

అప్పుడప్పుడు నటుడిగానే తన సత్తా చాటుకుంటున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించే అవసరాల శ్రీనివాస్... ఇటీవల విడుదలైన 'జెంటిల్‌మన్' సినిమాలో విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు.

డిఫరెంట్ రోల్

డిఫరెంట్ రోల్

నటుడిగా కేవలం ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాకుండా తనలోని వివిధ షేడ్స్ ను ప్రదర్శించి టాలెంటు నిరూపించుకోవాలని ఉవ్విల్లూరుతున్న అవసరాల శ్రీనివాస్ ఈ సారి డిఫరెంట్ కాన్సెప్టుతో వస్తున్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

హీరో పాత్ర తీరు తెన్నుల పరిశీలిస్తే..

హీరో పాత్ర తీరు తెన్నుల పరిశీలిస్తే..

పదిహేనేళ్ల కుర్రాడిగా ఉన్నప్పటి నుండే విపరీతమైన సెక్స్ కోరికలు ఉండే ఆ కుర్రాడు సెక్స్ సినిమాలు చూస్తూ పోలీసులకు దొరికిపోతాడు. ఇక కాలేజీ రోజుల్లోకి వచ్చాక అమ్మాయితో ఎఫైర్, తర్వాత పెళ్లైన ఆంటీతో ఎఫైర్...ఇలా సాగుతుంటుంది.

సెక్స్ అవసరమే అని వాదించే పాత్ర

సెక్స్ అవసరమే అని వాదించే పాత్ర

మనిషికి ఆకలి, నిద్ర ఎలాగో సెక్స్ కూడా అవసరమే....అది ప్రతి మనిషికి ఫిజికల్ నీడ్ అంటూ తన స్నేహితులతో వాదించే క్యారెక్టర్. ఇక ఇవన్నీ వదిలేసి పెళ్లి చేసుకోవాలని అనుకున్న అతడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా.

తెలుగులో?

తెలుగులో?

అయితే హిందీలో ఈ సినిమాను చాలా బోల్డ్‌గా, ఎమోషనల్‌గా తెరకెక్కించారు. అయితే తెలుగులోనూ అలా తీయడం సాధ్యం అవుతుందా? ఇక్కడ పరిస్థితులు అందుకు అనుకూలియాస్తాయా? అనే అనుమానం ఉండేది.

హిందీలో

హిందీలో

హిందీలో ఈ సినిమా ఫస్టాఫ్ బోల్డ్ గా సాగుతుంది, సెకండాఫ్ ఎమోషనల్ గా సాగుతుందని అవసరాల శ్రీనివాస్ తెలిపారు.

తగ్గకుండా

తగ్గకుండా

బాలీవుడ్లో ఈ సినిమా ఎలా ఉంటుందో.. టాలీవుడ్లోనూ అంతే బోల్డుగా, ఎమోషనల్ గా తీస్తామని తెలిపారు అవసరాల శ్రీనివాస్.

అడల్ట్ సినిమా అయినా..

అడల్ట్ సినిమా అయినా..

అడల్ట్ కామెడీ అనగానే అంతా ఏదో ఊహించుకుంటారు.. కానీ ఈ సినిమాలో చాలా లోతైన మీనింగ్ ఉంటుంది అన్నారు అవసరాల శ్రీనివాస్.

గుల్షన్ దేవయ్య

గుల్షన్ దేవయ్య

హిందీలో గుల్షన్ దేవయ్య పొషించిన సెక్స్ అడిక్ట్ రోల్ తెలుగులో అవసరాల శ్రీనివాస్ చేయబోతున్నారు.

నవీన్

నవీన్

ఈ సినిమా ద్వారా నవీన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

రెజీనా

రెజీనా

సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రెజీనా కనిపించబోతోంది.

యాంకర్, నటి శ్రీముఖి

యాంకర్, నటి శ్రీముఖి

నటిగా, యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమైన శ్రీముఖి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో సూపర్ హాట్ గా కనిపించబోతోంది.

English summary
Actress Mishti Chakraborthy, who made her tollywood debut romancing Nithiin in 'Chinnadana Neekosam', has been roped in to play one of the female leads opposite Avasarala Srinivas in 'Hunterr' telugu remake, which explores the life of a sex addict, was not only critically acclaimed but also branded adult even for the standards of Bollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu