»   » భూమిక వేసిన పాత్రను బాలీవుడ్ లో కత్రినాకైఫ్

భూమిక వేసిన పాత్రను బాలీవుడ్ లో కత్రినాకైఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : భూమిక,లయ,శివాజి కాంబినేషన్ లో వచ్చి హిట్టైన మిస్సమ్మ చిత్రం గుర్తుండే ఉంటుంది. నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2003లో విడుదలై ఓల్యాండ్ మార్క్ సినిమాగా బూమిక కెరీర్ లో నిలిచిపోయింది. ఇప్పుడా సినిమా హిందీ రీమేక్ కు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. హిందీలోనూ నీలకంఠ దర్శకత్వం చేయనున్నారు.

బాలీవుడ్ కోసం స్క్రిప్టు లో మార్పులు చేసి,రితీష్ దేశముఖ్, జెనీలియా కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే తెలుగులో భూమిక వేసిన పాత్రకు గానూ..కత్రినాకైఫ్ ని సంప్రదిస్తున్నట్లు వినపడుతోంది. గతంలోనూ నీలకంఠ..జెనీలియా కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కింది. దాంతో జెనీలియా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, రితీష్ దేశముఖ్ సొంత బ్యానర్ పైనే ఈ సినిమా చేసే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు.

ఇక ఈ విషయమై నీలకంఠ మాట్లాడుతూ... మిస్సమ్మను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అయితే ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం తెలుగులో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నాను. దాని తర్వాత మిస్సమ్మ చిత్రం ఉంటుంది అన్నారు.

English summary
Bhoomika,Laya and Sivaji starrer Missamma directed by G.Neelakantha Reddy turned out to be a hit in 2003. According to sources Neelakantha is contemplating on remaking the film in Hindi.The film will be remade in Hindi casting Ritesh Deshmukh and Genelia in the roles of Sivaji and Laya. Plans are on to rope in Katrina Kaif or Deepika Padukone for Bhoomika's role. Neelakanta's associate stated no decision has been taken and only after current film Maaya is completed Missamma may be taken up.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu