»   » తెలుగులో మిథున్ చక్రవర్తి ఎంట్రీ...డిటేల్స్

తెలుగులో మిథున్ చక్రవర్తి ఎంట్రీ...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mithun Chakraborty
హైదరాబాద్ : త్వరలో బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆది పినిశెట్టి హీరోగా ఆదర్శ చిత్రాలయ ప్రై.లి. బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నం:1 లో మిథున్ చేస్తున్నారు. ఇదో థ్రిల్లర్ తరహా చిత్రం. నిత్యామీనన్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే రవిరాజా పినిశెట్టి కుమారుడు సత్య ప్రభాస్‌ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.

దర్శకుడు సత్య ప్రభాస్‌ మాట్లాడుతూ..'చిన్నతనం నుంచీ నాన్నగారిని గమనిస్తు నాక్కూడ డైరెక్షన్‌ మీద ఆసక్తి పెరిగింది. చెన్నైలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. స్క్రిప్ట్‌ విషయంలో నాన్నగారి సలహాలు తీసుకున్నాను. యాక్షన్‌, కామెడీ అన్ని ఉన్న కమర్షియల్‌ చిత్రమిది. ప్రముఖ బాలీవుడ్‌ నటులు మిథున్‌ చక్రవర్తి ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నేను వెళ్ళి ఆయన్ని అడగ్గానే సౌత్‌ సినిమాలు చేయట్లేదు సారీ అన్నారు. పది నిమిషాలు కథ వినమన్నాను. ఆ తరువాత గంటన్నర పాటు కథ విని ఓకే అన్నారు. మంచి టీమ్‌ కుదిరింది. తొలి ప్రయత్నానికి అందరి ఆశీర్వాదం కావాలి' అని అన్నారు.


ఆది మాట్లాడుతూ..'ఇప్పటి వరకు తెలుగు, తమిళంలో కొంచెం డిఫరెంట్‌ రోల్స్‌ చేశాను. ఇందులో కొత్తగా కనిపిస్తాను. స్క్రిప్ట్‌ డిమాండ్‌ మేరకు యాక్షన్‌, ఫైట్స్‌ అన్ని ఈ కథలో ఉన్నాయి. ఏ సినిమాకైనా టీమ్‌ వర్క్‌ అనేది చాలా ఇంపార్టెంట్‌. ఈ సినిమాకి మంచి టీమ్‌ కుదిరింది. అన్నయ్య నేను చాలా తక్కువగా మాట్లాడుకుంటాం. కానీ ఈ సినిమా కోసం అన్ని విషయాలు షేర్‌ చేసుకోవాలి. తన మొదటి చిత్రానికి మంచి కథను ఎంచుకున్నాడు' అని అన్నారు.

రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ..'మా కుటుంబం నుంచి మూడవతరం దర్శకుడు చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. మా ఇద్దరు అబ్బాయిలు నేను చెప్పిన విధంగానే చదువు పూర్తి చేసి ఇండిస్టీలో అడుగుపెట్టారు. ఆది హీరోగా ప్రూవ్‌ చేసుకున్నాడు. పెద్ద అబ్బాయి కూడా ఎమ్‌.బి.ఏ కంప్లీట్‌ చేశాక సినిమాకి సంబంధించిన కోర్స్‌లు చేసి ట్రైనింగ్‌ అయ్యి తన మొదటి వెంచర్‌గా ఈ చిత్రాన్ని ప్రారంభించాడు. ఇంతకు ముందు ఓ షార్ట్‌ ఫిలిం కూడా చేశాడు. చెన్నైలో తన ఫ్రెండ్స్‌కి ఎదురైన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. స్నేహితుల కోసం అబ్రహం లింకన్‌ రాసిన ఓ లైన్‌ కూడా దీనికి ఆధారం అని చెప్పొచ్చు. నేటి నుంచి 40 రోజులు రెగ్యూలర్‌ షూటింగ్‌ జరుగుతుంది. రెండో షెడ్యూల్‌లో పాటలు, స్నేహితుల మధ్య సన్నివేశాలను మారిషెస్‌లో చిత్రీకరిస్తాం. నన్ను, నా సినిమాలను ఎలా ఆదరించారో అలాగే నా ఇద్దరు తనయులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను'అని అన్నారు.

English summary
Adi Pinisetti's yet to be titled thriller film will make the debut of Bollywood star Mithun Chakraborthy in an important role. Adi's brother Satya Prabhas is making his directorial debut. Nikhita Narayan is starting opposite Adi and the film produced on Adarsha Chitralaya Films banner. The film is based on real life incidents. Adi, Satya are the sons of Raviraja Pinisetti.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu