Just In
- 22 min ago
జెర్సీ బాలీవుడ్ రీమేక్.. ఆలస్యమైనా మంచి నిర్ణయమే తీసుకున్నారు!
- 25 min ago
RED Collections.. బ్రేక్ ఈవెన్‌కు అతి దగ్గరల్లో.. మూడు రోజుల్లో ఎంత కొల్లగొట్టిందంటే?
- 1 hr ago
చివరి కోరిక అదే.. తీరకుండానే చనిపోయారు..నర్సింగ్ యాదవ్ భార్య కామెంట్స్
- 2 hrs ago
విజయ్ దేవరకొండ అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్.. పాన్ ఇండియా కాదు.. అంతకుమించి!
Don't Miss!
- Finance
6 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.13 లక్షల కోట్లు జంప్: టీసీఎస్, ఎయిర్టెల్ అదుర్స్
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Sports
Gabba Test: ఆదుకున్న సుందర్, శార్దుల్.. భారత్ 336 ఆలౌట్.. ఆసీస్‌కు స్వల్ప ఆధిక్యం!
- News
బీజేపి తోనే తెలంగాణ కల సాకారం అవుతుంది.!కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ ఉద్ఘాటన.!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మిథున్ చక్రవర్తికి అనారోగ్యం, లాస్ ఏంజిల్స్ లో ట్రీట్ మెంట్
ముంబయి: తన డాన్స్ లలో బాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన బాలీవుడ్ డిస్కో కింగ్ మిథున్ చక్రవర్తి సంవత్సరకాలంగా ఎక్కడా కనపడటం లేదు. బాలీవుడ్ పార్టీలలో కానీ , మరొక ఈవెంట్ లలో కూడా పాల్గొనటం లేదు. దాంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ విషయం నిజమేనని ఆయన మేనేజర్ విజయ్ ఖరారు చేసారు.
విజయ్ చెప్పేదాన్ని బట్టి మిధున్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు వారాల క్రితం మిథున్ లాస్‌ఏంజెల్స్‌కి వెళ్లారు. ప్రస్తుతం దాదా(మిథున్) ముంబయిలో లేరని ఆయన లాస్‌ఏంజెల్స్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని కనీసం ఫోను కూడా వాడటం లేదని ఆయన మేనేజర్ విజయ్ మీడియాకు వెల్లడించారు. మిథున్ నెల తర్వాతే ముంబయి వస్తారని పేర్కొన్నారు.
అదీకాకుండా మిథున్ 2009లో 'లక్' చిత్రంలో నటిస్తున్నప్పుడు హెలికాప్టర్ నుంచి కిందకి దూకాల్సిన సన్నివేశం చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆయన ప్రమాదవశాత్తు కిందపడ్డారు. దాంతో ఆయన కాలికి తీవ్ర గాయం అయింది. అప్పటికి గాయం పూర్తిగా మానిపోయినా నెలరోజుల క్రితం మళ్లీ నొప్పి మొదలైందని మేనేజర్ విజయ్ తెలిపారు.

ఇక మిధున్ ..తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కూడా కావటంతో ఆ మధ్యన ఆయన వరుసగా రాజ్యసభ సమావేశాలకు గైర్హాజరటం జరిగింది. ఆయన ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ సమావేశాలను హాజరుకాలేనంటూ రాజ్యసభకు లేఖ రాస్తూ వస్తున్నారు. అయితే ఓ సారి మాత్రం అభ్యంతరాలు సభలో వచ్చాయి. ఓ సారి ఎప్పటిలాగే డిప్యూటీ స్పీకర్ పి.జె.కురియన్ ఆ లేఖను సభలో చదివి వినిపించారు. దీనిపై సవాజ్‌వాది పార్టీ నేత నరేష్ అగర్వాల్ అభ్యంతరం లేవనెత్తారు.
దేనికైనా ఒక పరిమితంటూ ఉండాలి. ఏ మనిషైనా ఆరోగ్యం సాకు చూపి ఎన్నాళ్లు సెలవు తీసుకోగలుగుతారు? ప్రతి సమావేశానికి ముందు మిథున్ నుంచి లెటర్ వస్తుంది. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడంటారు. ఒక సమావేశానికి అయితే సరిపుచ్చుకోవచ్చు. ప్రతీసారీ ఆయన ఇలాగే చెబుతున్నారు. ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు.
చైర్మన్ దీనిపై రూలింగ్ ఇవ్వాల్సిందే అంటూ పట్టుపట్టారు. మెడికల్ రిపోర్టులు కూడా మిథున్ సమర్పించినప్పుడు అభ్యంతరాలు ఎందుకు ఉండాలంటూ టిఎంసి నేత సుఖేందు శేఖర్ రాయ్ ఎదురు ప్రశ్నించారు. దీంతో కురియన్ జోక్యం చేసుకుంటూ, ఒక సభ్యుడు తాను అనారోగ్యంగా ఉన్నానని చెబితే కాదనలేమని అన్నారు. మిథున్ అభ్యర్థనను ఆమోదిస్తున్నట్టు సభలో ప్రకటించారు.
ఇక మిధున్ ... తెలుగులో వెంకటేష్ పవన్ కళ్యాణ్ లు కైలిసి నటిస్తున్న హింది రీమేక్ 'ఓ మై గాడ్' సినిమా గోపాల గోపాలలో కనిపించారు. ఆయన నటనకు మంచి ప్రంశసలు వచ్చాయి.
ఆయన త్వరగా కోలుకోవాలని వన్ ఇండియా తెలుగు కోరుకుంటోంది. అభిమానులైన మీరు కూడా ఆయన త్వరగా కోలుకుని ఇంటికి రావాలని కోరుకోండి. మీ స్పీడ్ రికవరీ విషెష్ ని క్రింద కామెంట్స్ కాలమ్ ద్వారా తెలియచేయండి.