»   » ఎంఎల్‌ఏ అలాంటి సినిమా కాదు.. మార్చి 23న ప్రేక్షకుల ముందుకు కల్యాణ్‌రామ్‌

ఎంఎల్‌ఏ అలాంటి సినిమా కాదు.. మార్చి 23న ప్రేక్షకుల ముందుకు కల్యాణ్‌రామ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

టి.జి.విశ్వప్రసాద్‌ సమర్పణలో బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మిస్తోన్న చిత్రం 'ఎంఎల్‌ఎ'. ఈ సినిమా మార్చి 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

నేనే రాజు తర్వాత..

నేనే రాజు తర్వాత..

కిరణ్‌ రెడ్డి మాట్లాడుతూ - ''మా బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ అసోసియేషన్‌లో గతేడాది విడుదలైన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా పెద్ద సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పీపుల్‌ మీడియా అసోసియేషన్‌లో చేసిన సినిమా 'ఎంఎల్‌ఎ'. 2017లో షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం.


అన్న కోసం అమెరికా నుంచి వచ్చేయనున్న ఎన్టీఆర్!
పెద్ద హిట్ అవుతుందని

పెద్ద హిట్ అవుతుందని

ప్రస్తుతం ఎంఎల్ఏ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు సహా అన్నీ పూర్తయ్యాయి. సెన్సార్‌ కార్యక్రమాలను మార్చి 15న జరుగనున్నాయి. అది పూర్తయితే సినిమాను మార్చి 23న విడుదల చేస్తాం'' అన్నారు. మా బ్యానర్‌లో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' కంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్‌ అవుతుందని భావిస్తున్నాను అని కిరణ్‌రెడ్డి అన్నారు.


యూఎస్‌లో రెండు సినిమాలు

యూఎస్‌లో రెండు సినిమాలు

విశ్వ ప్రసాద్‌ మాట్లాడుతూ - ''ఇంతకు ముందు మా బ్యానర్‌లో యు.ఎస్‌లో రెండు ఇండిపెండెంట్‌ సినిమాలు చేశాం. ఫీచర్‌ ఫిలిం పరంగా ఇదే మా తొలి సినిమా. మంచి చిత్రంగా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం'' అన్నారు.


పాటలకు మంచి రెస్పాన్స్

పాటలకు మంచి రెస్పాన్స్

వివేక్‌ కూచిబొట్ల మాట్లాడుతూ - ''ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలను ఆల్‌రెడీ విడుదల చేశాం. వాటికి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మరో రెండు సాంగ్స్‌ను కూడా త్వరలోనే విడుదల చేస్తాం. అలాగే మార్చి 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం'' అన్నారు.


సెన్సార్‌కు వెళ్తున్నాం..

సెన్సార్‌కు వెళ్తున్నాం..

భరత్‌ చౌదరి మాట్లాడుతూ - '' నేనే రాజు నేనే మంత్రి తర్వాత మా బ్యానర్‌లో చేసిన చిత్రమిది. ఈ సినిమా టీజర్‌, రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. రేపు సెన్సార్‌ కారక్రమాలు పూర్తి అవుతాయి. కల్యాణ్‌రామ్‌గారు సినిమా పూర్తయ్యే వరకు చాలా మంచి సహకారం అందించారు'' అన్నారు.


వినోదాత్మకంగా ఎంఎల్‌ఏ

వినోదాత్మకంగా ఎంఎల్‌ఏ

దర్శకుడు ఉపేంద్ర మాధవ్‌ మాట్లాడుతూ ''మా 'ఎంఎల్‌ఎ' సినిమా పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుంది. టైటిల్‌ని చూసి ఇది రాజకీయ సినిమా అనుకోవద్దు. చాలా ఫన్‌తో కూడుకుని ఉంటుంది. ఫస్టాఫ్‌ కార్పొరేట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సెకండాఫ్‌ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, హీరో కల్యాణ్‌రామ్‌గారికి థాంక్స్‌. సినిమాను మార్చి 23న విడుదల చేస్తున్నాం'' అన్నారు.


నటీనటులు, సాంకేతికవర్గం

నటీనటులు, సాంకేతికవర్గం

రవి కిష‌న్‌, పోసాని , జయప్రకాశ్ రెడ్డి, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, శివాజీ రాజా,ప్రభాస్ శ్రీను, లాస్యా , మనాలి రాథోడ్ ఈ చిత్రం లో ప్రధాన తారాగ‌ణంగా న‌టించారు. ఈ చిత్రానికి సమర్పణ : టీజీ విశ్వప్రసాద్ , రచనా సహకారం : ప్రవీణ్ వర్మ, ఆది నారాయణ, సంగీతం: మని శర్మ , సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ , ఎడిటింగ్‌: తమ్మిరాజు , సమర్పణ : టీజీ విశ్వప్రసాద్ , కో ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభొట్ల , నిర్మాతలు : సీ భరత్ చౌదరి, యంవీ కిరణ్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్.


English summary
Kalyan Ram's latest movie is MLA. Kalal Agarwal lead pair for Kalyan Ram. Director is Upendra Madhav. This is set to release March 23rd. In this occassion, Producers of the movie organised press meet and revealed the movie release date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu