»   » అక్కినేనిని అవమానించేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు!

అక్కినేనిని అవమానించేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఓ వైపు అక్కినేని నాగేశ్వరరావు మరణంతో యావత్ అభిమాన ప్రపంచం, సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రజలు విషాదంలో మునిగిపోతే.....అదే సమయంలో అసెంబ్లీలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. అక్కినేని ఫ్యామిలీ తక్కువ రేటుకే అన్నపూర్ణ స్టూడియో కోసం పేదల భూములు కొట్టేసారంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

  ఓ వైపు అక్కినేని మరణించిన సమయంలో....విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ఈ అసందర్భ వ్యాఖ్యలతో పలువురు నివ్వెర పోయారు. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అక్కినేనిని అవమానించడమే అని పలువురు అక్కినేని అభిమానులు మండి పడుతున్నారు. విషాద సందర్భంలో ఎమ్మెల్యే అయి ఉండి ఇలా మాట్లాడి ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు.

  గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అక్కినేని నగరంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం అర్థరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 2-45 నిముషాలకు తుదిశ్వాస విడిచారు. అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో ముగిసాయి. అక్కినేని వారసులు వెంకట్, నాగార్జున, సుమంత్, నాగ చైతన్య, సుప్రియ, అఖిల్ తదితరులు ఈ అంత్యక్రియల క్యార్రమంలో పాల్గొన్నారు.

  రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కినేనికి గన్ సెల్యూట్ చేసారు. అంతకు ముందు ఏపీ ఫిల్మ్ చాంబర్ నుండి అక్కినేని పార్తివ దేహాంతో అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో వేలాది మంది అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు, సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

  కృష్ణా జిల్లా వెంకటరాఘవ పురంలో 1920 సెప్టెంబర్ 20న ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన అక్కినేని వయస్సు 91 సంవత్సరాలు. 1944లో సినీ ప్రస్థానం మొదలెట్టిన నాగేశ్వరరావు తొలి చిత్రం ధర్మపత్ని. చివరి చిత్రం మనం. ఆయన ధరించిన ఎన్నో పాత్రలు చిరస్మరణీయాలై మిగిలిపోయాయి.

  English summary
  MLA P.Vishnuvardhan Reddy made controversial comment on ANR. Though there were allegations against Akkineni family of getting lands for Annapurna Studios for cheap price or encoraching poor people's lands, Vishnuvardhan Reddy chose wrong time to raise the issue.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more