twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక్కడా బెదిరింపులే.., హైదరాబాద్‌లో సినిమా థియేటర్లను తగలబెడతాం: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

    సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వచ్చిన పద్మావతి సినిమాను బహిష్కరించడమే కాకుండా విడుదల కాకుండా అడ్డుకోవాలని హిందూధర్మ పరిరక్షకులకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పిలుపునిచ్చారు.

    |

    ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ నిర్మిస్తున్న ప‌ద్మావ‌తి చిత్రంపై దేశ వ్యాప్తంగా ఆంద‌ళ‌న‌లు వ్య‌క్తం కావ‌టం తెలిసిందే. బాలీవుడ్ మూవీ పద్మావతి వివాదం మరింత పెద్దదవుతోంది. చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇఫ్పటికే దేశవ్యాప్తంగా సెగలు రాజేస్తుండగా ఇపుడు ఆ మాటల మంటలు తెలంగాణకు చేరాయి.

     బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

    చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించేలా ఈ చిత్రం ఉంటే మాత్రం ఒప్పుకునేది లేదంటూ ప‌లువురుహెచ్చ‌రిస్తున్నారు. ఇలా వార్నింగ్ లు ఇస్తున్న వారి జాబితాలోకి ఎక్కారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.చరిత్రను వక్రీకరించి ‘పద్మావతి' సినిమా తీశారని బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్‌ లోథ మండిపడ్డారు.

    రాజ్‌పుత్‌ల గౌరవానికి భంగం

    రాజ్‌పుత్‌ల గౌరవానికి భంగం

    ఈ సినిమాను ప్రదర్శిస్తే ధియేటర్లు తగలబెడతామని హెచ్చరించారు. రాజ్‌పుత్‌ల గౌరవానికి ఎవరు భంగం కలిగించినా సహించబోమన్నారు. సికింద్రాబాద్‌లో మంగళవారం జరిగిన రాజస్థాన్‌ రాజ్‌పుత్‌ సమాజ్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మహ్మద్‌ ప్రవక్త, జౌరంగజేబుపై సినిమా తీయాలని సంజయ్‌లీలా భన్సాలీకి సవాల్‌ విసురుతున్నా. ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నార"ని ధ్వజమెత్తారు.

    థియేట‌ర్లు త‌గ‌ల‌బెడ‌తాం

    థియేట‌ర్లు త‌గ‌ల‌బెడ‌తాం

    ఈ సినిమాను ప్ర‌ద‌ర్శిస్తే థియేట‌ర్లు త‌గ‌ల‌బెడ‌తామ‌ని రాజాసింగ్ వార్నింగ్ ఇవ్వ‌ట‌మే కాదు.. ప‌ద్మావ‌తి చిత్రాన్ని బ‌హిష్క‌రించాలంటూ పిలుపునిచ్చారు. బ‌న్సాలీ క‌ట్టుక‌థ‌లు అల్లార‌ని.. సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ- ప‌ద్మావ‌తి మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు చిత్రీక‌రించార‌ని ఆరోపించారు.

     విడుదల కాకుండా అడ్డుకోవాలి

    విడుదల కాకుండా అడ్డుకోవాలి

    ప‌ద్మావ‌తి సినిమాపై ఇప్ప‌టికే ప‌లు వార్నింగ్ లు వ‌చ్చినా..తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో వార్నింగ్ ఇచ్చింది మాత్రం రాజాసింగ్ మాత్ర‌మే.అలాగే ఈ సినిమాను బహిష్కరించడమే కాకుండా విడుదల కాకుండా అడ్డుకోవాలని హిందూధర్మ పరిరక్షకులకు రాజాసింగ్‌ పిలుపునిచ్చారు.

    బెయిల్‌ ఇప్పిస్తానని హామీ

    బెయిల్‌ ఇప్పిస్తానని హామీ

    ఇక హైదరాబాద్‌ పరిధిలో ‘పద్మావతి' సినిమాను అడ్డుకుని అరెస్టైన వారి తరపున తాను బాధ్యత తీసుకుంటానని, వారందరికీ తాను బెయిల్‌ ఇప్పిస్తానని హామీయిచ్చారు. ఇదిలా ఉంటే ‘పద్మావతి' సినిమా డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

    న‌వంబ‌రు 10న భారీ నిర‌స‌న

    న‌వంబ‌రు 10న భారీ నిర‌స‌న

    ఇదిలా ఉండ‌గా.. ఈ సినిమాకు వ్య‌తిరేకంగా జైపూర్ లో భ‌జ‌రంగ్ ద‌ళ్‌.. రాజ్ పుత్ స‌భ ఆందోళ‌న చేప‌ట్టాయి. న‌వంబ‌రు 10న భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు పిలుపునిచ్చాయి. రాజ‌స్థాన్ లో ఈ చిత్రాన్ని కొనేందుకు డిస్ట్రిబ్యూట‌ర్లు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

    కర్ణిసేన ఆధ్వర్యంలో దాడి

    కర్ణిసేన ఆధ్వర్యంలో దాడి

    ఈ సినిమా మీద వివాదం కొలిక్కి వ‌చ్చే వ‌ర‌కూ ఈ సినిమాను కొనుగోలు చేయ‌లేమ‌ని పంపిణీదారులు తేల్చి చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ జైపూర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ సినిమా యూనిట్ పై కర్ణిసేన ఆధ్వర్యంలో దాడి జరిగింది. దీనిపై బాలీవుడ్ తీవ్రంగా స్పందించింది.

     వివాదం మాత్రం చల్లారడంలేదు

    వివాదం మాత్రం చల్లారడంలేదు

    ప్రముఖులందరూ భన్సాలీకి మద్దతు పలికారు. ఆ తర్వాత లొకేషన్ మార్చేసి తన సినిమాని పూర్తి చేసాడు భన్సాలీ. కానీ వివాదం మాత్రం ఇంకా చల్లారడంలేదు. ఇప్పటికే భావ ప్రకటనా స్వేచ్చ అంశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన "మెర్సల్" సినిమా వివాదం కేవల తమిళ ఇందస్ట్రీనే కాక మొత్తాం దేశాన్నే ఒక కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వివాదం విషయంలోనూ బీజేపీదే కీలక పాత్రకావటం గమనార్హం.

    English summary
    Telangana BJP MLA T Raja Singh has alleged that the film "Padmavathi" Directed by Sanjay Leela bansali Distorts history and disregards the Rajputs and Rajasthani culture.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X