»   » పూరీ జగన్నాధ్ 'బుడ్డ' చిత్రం షూటింగ్ ఆపివేత..వివాదం

పూరీ జగన్నాధ్ 'బుడ్డ' చిత్రం షూటింగ్ ఆపివేత..వివాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమితాబ్ బచ్చన్ తో పూరీ జగన్నాధ్ రూపొందిస్తున్న 'బుడ్డ' చిత్రం షూటింగ్‌కు మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సమితి బుధవారం అంతరాయం కలిగించింది. ముంబయిలో యునైటెడ్‌ మిల్స్‌ వద్ద జరుగుతున్న షూటింగ్‌ను పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఒక పాట చిత్రీకరణ సందర్భంగా అందులో విదేశీయులు పాల్గొనరాదని వారు అభ్యంతరపెట్టారు. వారికి వర్క్‌ పర్మిట్‌ లేదని కార్యకర్తలు ఆరోపిస్తూ గొడవచేసారు.షూటింగ్‌లో పాల్గొనే పలువురు విదేశీయులకు వర్క్‌ పర్మిట్లు లేవన తమకు తెలిసిందని ఆమేరకు తాము శివాజీ పార్కు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని సినీసెట్‌లపై దాడి చేయాలని కోరామని, ఆమేరకు అందులో పాల్గొంటున్న 17మంది విదేశీయుల పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకుని తనిఖీ చేస్తున్నారని పార్టీ నేత ఒకరు చెప్పారు.

వారిలో కొంతమందికి టూరిస్టు విసాలు మాత్రమే ఉన్నాయన్నారు. సినిమా ప్రొడక్షన్‌ యూనిట్‌ కొంతమందిని బైటకు పంపేసిందని ఆసమయంలో అక్కడే ఉన్న అమితాబ్‌ తర్వాత కనిపించలేదని చెప్పారు.పార్టీ నేత అమేయఖోప్‌కార్‌ మాట్లాడుతూ అమితాబ్‌ కంపెనీ చట్టవిరుద్ధంగా చేస్తున్న షూటింగ్‌ను తాము అనుమతించబోమని అన్నారు. ఇక్కడివారికి పనులు లేక అల్లాడుతుంటే విదేశీయులను తెచ్చి షూటింగ్‌ జరపటమేమిటని ప్రశ్నించారు. వారిలో కొంతమందికి వర్క్‌ పర్మిట్లు లేవని మరికొంతమంది విసాలు 2009లోనే కాలం ముగిసిపోయాయని వెల్లడించారు. షూటింగ్‌ కోసం స్థానిక పోలీసుల అనుమతి తీసుకోలేదన్నారు. ఆమేరకు తాము పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.ఛార్మి ఈ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తోంది.

English summary
Members of the Raj Thackeray-led MNS' film wing today disrupted shooting of "Buddha Mil Gaya", being produced by Amitabh Bachchan's AB Corp, citing violations of norms on inclusion of foreign artistes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu